ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన నలుగురు జమ్ముకశ్మీర్ యువకులను వెనక్కు రప్పించగలిగినట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. బడ్గామ్, గాందర్బల్ నుంచి ఇద్దరు చొప్పున యువకులు తీవ్రవాదం వైపు మళ్లినట్లు వెల్లడించారు.
ఉగ్రవాదుల్లో కలవడానికి వెళ్లిన గాందర్బల్ జిల్లా బట్వినా, కుర్హమా ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు వారి కార్యకలాపాల సంగతి తెలియదని చెప్పారు.
మరో ఉదంతంలో బడ్గామ్లో కౌమార దశలో ఉన్న వ్యక్తులను తీవ్రవాదులతో కలవకుండా పోలీసులు నిరోధించగలిగారు. వారు మార్చి 14న తమ ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. పోలీసులు వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చూడండి: ఒక్కరోజులోనే 30 లక్షల టీకాలతో భారత్ రికార్డ్