ఒడిశా గంజాం జిల్లా బ్రహ్మపురలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు.. ఉపాధ్యాయుల సాయంతో పనికిరాని ఇనుప వస్తువులతో 30 అడుగుల ఎత్తైన భారతదేశ చిత్రపటాన్ని తయారు చేశారు. ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసిన మ్యాప్‌లో పెద్ద నెమలి, పెన్నులు ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద 'స్క్రాప్ పార్క్'లో దీనిని ఆవిష్కరించారు.
ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.
25 రోజుల కష్టానికి ఫలితం
కళాశాలలోని ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్, పెయింటర్ విభాగానికి చెందిన విద్యార్థులు.. 25 రోజులు శ్రమించి భారత్ మ్యాప్‌ను తయారు చేశారు. గతంలో అతిపెద్ద గిటార్, జిగ్సా పజల్, రోబోట్, ఐరన్ మ్యాన్ వంటివి రూపొందించారు.
ఇదీ చూడండి: తూటాలకు ఎదురెళ్లే సైనికుల కోసం 'ఐరన్ సూట్'!