ETV Bharat / bharat

రిటైర్మెంట్​కు నో అంటున్న​ 'సూపర్​ ఫిట్'​ శునకం!

author img

By

Published : Sep 28, 2021, 5:43 PM IST

భద్రతాదళాల కార్యకలాపాల్లో శునకాల పాత్ర ఎంతో ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక జాతి శునకాలకు ఎంతో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం కే9 జాతికి చెందిన సిబు అనే శునకం.. వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న అడవుల్లో విధులు నిర్వహిస్తోంది. దాదాపు 10ఏళ్లు వచ్చినా.. రిటైర్మెంట్​ వయస్సులో దాని ఫిట్​నెస్​ చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. 'అసలు సిబుకు రిటైర్మెంట్ ఉందా?'​ అని అనుకుంటున్నారు.

cebu dog
సిబు

వామపక్ష తీవ్రవాదం బలంగా ఉండే ప్రాంతాల్లో భద్రతా కార్యకలాపాలు కత్తిమీద సాముతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా దట్టమైన అడవుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి. ఇక్కడ విధులు నిర్వహించే ఐటీబీపీ భద్రతాధికారులకు శిక్షణ పొందిన ప్రత్యేక జాతి శునకాలు ఎప్పుడూ సహాయం అందిస్తుంటాయి. అందులో కే9 జాతి కుక్కలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఒకటి సిబు.

ఏ శునకానికైనా వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. సిబు ఇందుకు భిన్నం. దాదాపు 10ఏళ్ల వయస్సున్నా.. ఎంతో చురుకుగా విధులు నిర్వహిస్తోంది. 'అసలు సిబుకు రిటైర్మెంట్​ ఉంటుందా?' అని అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

సిబుకు ఇప్పుడు తొమ్మిదేళ్ల ఎనిమిది నెలలు. తనకన్నా తక్కువ వయస్సున్న కుక్కలతో పోటీపడి మరీ విధులు నిర్వహిస్తోంది సిబు. ఎంతో చురుకుగా 14-25 కిలోమీటర్లు ప్రయాణించగలదు. భద్రతాదళాల వాహనాలకు ముందుండే 'వాన్​గార్డ్​'లో సిబు నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. బాంబులు, పేలుడు పదార్థాలు, ఆకస్మిక దాడులను ముందే పసిగడుతుంది. ఇలా ఎన్నో సందర్భాల్లో బృందాన్ని కాపాడింది.

కే9ల రిటైర్మెంట్​పై ఐటీబీపీ ఏడాదికోసారి సమీక్ష నిర్వహిస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో.. సిబు అన్నీ పాసైపోయింది. ఫిట్​నెస్​ పరీక్షల్లో టాప్​లో నిలిచింది.

ఐటీబీపీలో కే9 జాతి శునకాలకు ప్రాధాన్యం ఎక్కువే ఉంటుంది. శునకాలను 'హీరోలు'గా పరిగణిస్తారు. రిటైర్మెంట్​ అనంతరం వాటి కోసం 'వెటరన్స్​ హోం'లు ఎదురుచూస్తూ ఉంటాయి. అక్కడ వాటి బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు.

సిబు ఇంకా చురుకుగానే ఉన్నా.. శునకానికి రిటైర్మెంట్​ ఇవ్వాలని ఐటీబీపీ యోచిస్తోంది. ఇన్నేళ్లు సిబు చేసిన కృషికి ప్రతిఫలంగా రిటైర్మెంట్​ జీవితాన్ని హాయిగా గడిపే అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

రిటైర్మెంట్​ తర్వాత.. సిబు ఏసీ రైల్​లో రాయ్​పుర్​ నుంచి ఛండీగఢ్​ వెళుతుంది. అక్కడ ఉన్న ఎన్​టీసీడీ(నేషనల్​ ట్రైనింగ్​ సెంటర్​ ఫర్​ డాగ్స్​) సంరక్షణలో తన జీవితాన్ని గడుపుతుంది.

ఇదీ చూడండి:- శునకం కోసం విమానం బిజినెస్​ కేబిన్​ బుకింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.