ETV Bharat / bharat

'సెన్సర్లు ఫెయిలైనా.. ఇంజిన్లు పనిచేయకపోయినా.. చంద్రయాన్-3 ల్యాండింగ్ మాత్రం పక్కా'

ISRO Somnath on Chandrayaan 3 Landing : చంద్రయాన్‌-3ను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేసేందుకు ఇస్రో పక్కాగా సిద్ధమైంది. చంద్రయాన్‌-2లో ఎదురైన అవరోధాలు మళ్లీ ఎదురైనా వాటిని అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఉన్న రెండు ఇంజన్లు చెడిపోయినా, సెన్సర్లు విఫలమైనా జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసి తీరుతామని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ధీమా వ్యక్తం చేశారు. సోమనాథ్‌ వ్యాఖ్యలతో చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావడం తథ్యమన్న అంచనాలు పెరిగిపోయాయి.

Chandrayaan 3 Landing date
ISRO Somnath on Chandrayaan 3 Landing
author img

By

Published : Aug 9, 2023, 5:29 PM IST

ISRO Somnath on Chandrayaan 3 Landing : దేశమంతా చంద్రయాన్‌-3 జాబిల్లిపై అగుపెట్టడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన దేశ ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్‌.. ఆగస్టు 23న చంద్రయాన్‌-3 సురక్షితంగా జాబిల్లిపై దిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ వేగాన్ని తగ్గించడమే అత్యంత కష్టమైన ప్రక్రియని వివరించారు. చంద్రయాన్‌-2 సమయంలో ఈ దశలో జరిగే ప్రక్రియల్లోనే సమస్యలు తలెత్తాయని గుర్తుచేశారు.

Chandrayaan 3 Update : చంద్రయాన్‌-2 వైఫల్యంతో చంద్రయాన్‌-3 డిజైన్‌ చాలా జాగ్రత్తగా రూపొందించామని సోమనాథ్ తెలిపారు. డిజైన్ వైఫల్యాలను తట్టుకోగలిగేలా ల్యాండర్ విక్రమ్​ను తయారు చేశామని చెప్పారు. ఎక్కువ ఇంధనం వాడుకోకుండా చూడటమే కాకుండా దూరాన్ని కచ్చితంగా లెక్కించామని వెల్లడించారు. ఆగస్టు 23న ల్యాండర్‌లోని సెన్సర్లు విఫలమైనా, రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా ల్యాండర్‌ సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి చేరగలదని సోమనాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Chandrayaan 3 Launch Date : చంద్రయాన్-3 జూలై 14న అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 23న జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అవుతుంది. విక్రమ్ ల్యాండర్‌ను నిలువుగా ల్యాండ్‌ చేయడమే అత్యంత క్లిష్టమైన ప్రక్రియన్న ఇస్రో ఛైర్మన్.. ఆ వైఫల్యాలను కూడా చంద్రయాన్‌-3 తట్టుకోగలదని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను దించడం కోసం స్థలాన్ని గుర్తించామని తెలిపారు.

Chandrayaan 3 Live Location : ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లికి మరింత చేరువైంది. వ్యోమనౌక కక్ష్యను మరింత తగ్గించినట్లు ఇస్రో బుధవారం ప్రకటించింది. చంద్రుడికి 174 x 1437 కిలోమీటర్ల కక్ష్యలోకి వ్యోమనౌకను విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఆగస్టు 14న ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరోసారి కక్ష్యను తగ్గిస్తామని తెలిపింది. ఆదివారం ఇలాగే చంద్రయాన్-3 కక్ష్యను తగ్గించింది ఇస్రో.

  • Chandrayaan-3 Mission:
    Even closer to the moon’s surface.

    Chandrayaan-3's orbit is reduced to 174 km x 1437 km following a manuevre performed today.

    The next operation is scheduled for August 14, 2023, between 11:30 and 12:30 Hrs. IST pic.twitter.com/Nx7IXApU44

    — ISRO (@isro) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో రెండుసార్లు కక్ష్యను తగ్గించిన తర్వాత స్పేస్​క్రాఫ్ట్ జాబిల్లికి చేరువగా వెళ్తుంది. ఆగస్టు 16న చివరిసారి కక్ష్యను తగ్గించనున్నారు. ఆ సమయానికి చంద్రయాన్-3 వంద కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ వేరుపడతాయి. తర్వాత ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ జాబిల్లిపై దించేందుకు ప్రయత్నిస్తారు. ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తారు.

తొలిసారి జాబిల్లి ఫొటోలను తీసిన చంద్రయాన్​-3.. కక్ష్య తగ్గింపు ప్రక్రియ సక్సెస్​

Chandrayaan 3 : 'జాబిల్లి' కక్ష్యలోకి 'చంద్రయాన్‌-3'.. ఇక నుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.