అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)తో కలిసి అత్యంత హైరిజల్యూషన్ చిత్రాలు తీసే సింథటిక్ అపెర్చర్ రాడార్(సార్)ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అభివృద్ధి చేసింది. సంయుక్త భూ పరిశోధన మిషన్ కోసం.. ఈ రాడార్‌ను ఇరుదేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు రూపొందించాయి. నాసా-ఇస్రో పేరు కలిసివచ్చేలా ఈ వ్యవస్థకు 'నిసార్' అనే పేరు పెట్టారు.
ఇదీ చదవండి: స్వదేశీ పరిజ్ఞానంతో ఆసియాలోనే అతిపెద్ద 'స్పెక్ట్రోగ్రాఫ్'
భూ పరిశోధనకు ఉపయుక్తంగా..
ఎల్, ఎస్ బ్యాండ్ ప్రీక్వెన్సీ ఉపగ్రహాల్లో ఉపయోగించేలా రూపొందించిన నిసార్.. భూ పరిశోధనకు ఉపకరిస్తుంది. భూమిపై సెంటీమీటరు కంటే తక్కువ వైశాల్యాన్ని కూడా నిసార్ ద్వారా కొలవవచ్చని పేర్కొంది నాసా.
నిసార్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు 2014 సెప్టెంబరులో ఒప్పందం చేసుకుంది ఇస్రో. 2022లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించే ఉపగ్రహంలో నిసార్‌ను ఉపయోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సంయుక్త మిషన్ కోసం.. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్‌ను, సైన్స్ డేటా కోసం హైరేట్ కమ్యూనికేషన్ సబ్‌సిస్టమ్, జీపీఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్‌లను నాసా సమకూరుస్తోంది. వాహకనౌక, ఎస్ బ్యాండ్ రాడార్, ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అవససరమైన సేవలను ఇస్రో సమకూరుస్తోంది. ఈ సంయుక్త మిషన్ ద్వారా ఆధునిక రాడార్ ఇమేజింగ్ ద్వారా.. భూ ఉపరితల మార్పులకు కారణాలను కనుగొనవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: మార్చి 28న ఇస్రో 'జీశాట్-1' ప్రయోగం