ETV Bharat / bharat

'నేతాజీ​ మరణించారా? బతికే ఉన్నారా? రెండు నెలల్లో చెప్పండి!'

Is Netaji dead or alive: నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ఎన్నో వాదానలు వినిపిస్తుంటాయి. అయితే ఈ మిస్టరీపై కేంద్రం వైఖరి ఏంటని కోల్​కతా హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రెండు నెలల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది.

Is Netaji dead or alive
నేతాజీ
author img

By

Published : Dec 13, 2021, 7:21 PM IST

Is Netaji dead or alive: నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీపై తమ వైఖరిని వెల్లడించాలని కేంద్రాన్ని అదేశించింది కోల్​కతా హైకోర్టు. చంద్రబోస్​ మరణించారా? లేక ఇంకా జీవిస్తున్నారా? అన్న విషయాన్ని రెండు నెలల్లోగా చెప్పాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై అఫిడవిట్​ దాఖలు చేయాలని నిర్దేశించింది.

ఓ పిల్​పై సోమవారం విచారణ చేపట్టిన అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్​ శ్రీవాస్తవతో కూడిన బెంచ్​.. ఈ ఆదేశాలు జారీ చేసింది. భారతీయ కరెన్సీలో సుభాష్​ చంద్రబోస్​ ఫొటోలను వినియోగిస్తారా? అన్న ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

స్వాతంత్ర్య సమరయోధుడు హిరేంద్రనాథ్​ బగ్చి ఈ పిల్​ను దాఖలు చేశారు. ఇండియన్​ కరెన్సీపై నేతాజీ ఫొటోలు ముద్రించాలని డిమాండ్​ చేశారు.

నేతాజీ మరణించారా? లేదా? అన్న విషయం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 1941లో సొంత ఇంట్లో నుంచి మారువేషంలో ఆయన తప్పించుకున్నారు. ఆ తర్వాత దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అక్కడి వరకు సమాచారం ఉన్నా.. ఆ తర్వాత ఆయన మరణంపై అనేక ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. 1945 ఆగస్టు 18న జపాన్​లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారని కొందరు భావిస్తున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.