ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ తన సామ్రాజ్యాన్ని భారత్లో విస్తరించేందుకు(ISIS in India) కుట్రలు చేస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రకటించింది. ఐసిస్ సిద్ధాంత స్ఫూర్తితో జరిగిన దాడులు(ISIS attack in india), కుట్రలు, ఉగ్ర నిధులకు సంబంధించి మొత్తం 37 కేసులను విచారించి ఈ నిర్ధరణకు వచ్చింది. ఆన్లైన్లో నిరంతరం ప్రచారం నిర్వహిస్తూ భారత యువతకు గాలం వేసేందుకు ఐసిస్ విశ్వ ప్రయత్నాలు(isis recruitment in india ) చేస్తోందని ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది.
తమ సమీప ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎవరికైనా కొంచెం అనుమానం వచ్చినా వెంటనే 011-24368800 నంబరుకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ఉగ్రకార్యకలాపాలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఐసిస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని(isis india arrest ) విచారిస్తున్నారు.
ఐసిస్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రసంస్థ. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ సంస్థ మళ్లీ బలపడుతుందని భద్రతా నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. పొరగు దేశమైన భారత్‌లోకి చొరబడేందుకు(ISIS in kashmir ) కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం..