ETV Bharat / bharat

మొన్న సింధియా.. నిన్న ప్రసాద.. తర్వాత?

మొన్న జోతిరాదిత్య సింధియా, నిన్న జితిన్​ ప్రసాద.. కాంగ్రెస్​ను వీడారు. ఆ తర్వాత ఎవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మదిలో ఉంటుంది. ఎందుకు ఇలా? ప్రస్తుత పరిణామాలతో కాంగ్రెస్​ యువ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోందా? పార్టీలో తమకు భవిష్యత్తు లేదనే భావనలో ఉన్నారా?

Congress
కాంగ్రెస్​
author img

By

Published : Jun 10, 2021, 3:31 PM IST

కాంగ్రెస్​ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. యువ నేతలు వరుసగా పార్టీని వీడటమే ఇందుకు నిదర్శనం. 2022లో ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో జితిన్​ ప్రసాద పార్టీ మారటం కాంగ్రెస్​కు పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఆయన రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు.

Congress
జితిన్​ ప్రసాద

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జితిన్​ ప్రసాద భాజపాలో చేరటం.. కాంగ్రెస్​ పార్టీ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అసంతృప్త యువ నేతలు పార్టీలో తమకు భవిష్యత్తు లేదనే భావనకు వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే.. పార్టీని వీడేందుకు కారణమవుతోంది. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల బృందంలో జితిన్​ ప్రసాద ఒకరు. పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం సహా సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్​ చేశారు.

జితిన్​ తర్వాత ఎవరు?

రాహుల్​ గాంధీ బృందంలో కీలకంగా ఉన్న వారిలో జోతిరాదిత్య సింధియా తర్వాత పార్టీ మారిన ప్రముఖ యువ నేత జితిన్​ ప్రసాద. అయితే.. ఇక్కడితో ఆ జాబితా ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ వ్యవహారాలపై సచిన్​ పైలట్​, మిళింద్​ దేవ్​రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

జితిన్​ ప్రసాద పార్టీ వీడిన మరుసటి రోజునే.. మిళింద్​ దేవ్​రా ట్వీట్​ చేశారు. "భారత్​లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్​ తిరిగి పుంజుకుంటుందని నమ్ముతున్నా. మాకు ఇంకా బలమైన నాయకత్వం ఉంది. పార్టీని పూర్వస్థితికి అది తీసుకురాగలదు. నా స్నేహితులు, తోటివారు, విలువైన భాగస్వాములు మమల్ని విడిచిపెట్టలేదనే అనుకుంటున్నా" అని పేర్కొన్నారు.

Congress
మిళింద్​ దేవ్​రా ట్వీట్​

సచిన్​ పైలట్​, అశోక్​ గహ్లోత్​ మధ్య విబేధాలు ఏడాది కాలంగా కొనసాగుతున్నాయి. ఆయనపై కొద్దినెలల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేశారు పైలట్​. కానీ, హైకమాండ్​ హామీతో పార్టీలోకి తిరిగివచ్చారు. అయినప్పటికీ ఈ విషయంపై చర్యలు తీసుకోవటంలో జాప్యంపై అసంతృప్తిగానే ఉన్నారు. భాజపాతో సచిన్​ పైలట్​ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగాహానాలు మళ్లీ వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్​కు పెద్ద దెబ్బ!

"జితిన్​ ప్రసాద పార్టీని వీడటం కాంగ్రెస్​కు పెద్ద ఎదురుదెబ్బ. కాంగ్రెస్​ అభివృద్ధి కోసం పాటు పడిన ఎందరో యువ నేతలను కోల్పోయాం. జోతిరాదిత్య సింధియా కొద్ది రోజుల క్రితం పార్టీ వీడారు. ఇప్పుడు జితిన్​ ప్రసాద. కాంగ్రెస్​ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఈ పరిణామాలతో ప్రస్తుతం భాజపా లాభపడుతోంది. "

- సంజయ్​ ఝా, కాంగ్రెస్​ మాజీ అధికార ప్రతినిధి.

అయితే.. కాంగ్రెస్​ తన తప్పును ఒప్పుకుని, వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ఆత్మపరిశీలన చేసుకుంటుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్​ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. "వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోతారు. వారిని మేము అడ్డుకోం. అది ఆయన(జితిన్​ ప్రసాద) నిర్ణయం. ఇక్కడ కూడా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. ఏదేమైనా ఇది దురదృష్టకరం" అని పేర్కొన్నారు.

భాజపాకు లాభం!

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​ పరిస్థితి కొన్నేళ్లుగా ఆందోళనకరంగానే ఉంది. జితిన్​ ప్రసాద పార్టీని వీడటం కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ మాత్రమే కాదు.. అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. భాజపాకు లాభం చేకూరనుంది. జితిన్​ కమలదళంలో చేరటం వల్ల బ్రాహ్మణ వర్గం భాజపా వైపు మళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది.

ఇవీ చూడండి: భాజపాలో చేరిన కాంగ్రెస్ కీలక నేత

కాంగ్రెస్ పార్టీ నవతరంలో గూడుకట్టుకున్న 'అసంతృప్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.