ETV Bharat / bharat

'ఇరుపక్షాలు పరిష్కారం కోరుకుంటున్నాయి.. కానీ!' - వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన

వ్యవసాయ చట్టాల సమస్యపై ఉభయ పక్షాలు పరిష్కారాన్నే కోరుకుంటున్నాయని, ఇతర భావజాలం ఉన్న వ్యక్తుల వల్లే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వంతో రైతులు నేరుగా మాట్లాడితే పరిస్థితి వేరుగా ఉండేదని అభిప్రాయపడింది. మంచి పనులు జరిగేటప్పుడు అవాంతరాలు ఎదురవుతాయని తెలిపింది.

farmers protest
'వారి భావజాలం వల్లే పరిష్కారం ఆలస్యం'
author img

By

Published : Jan 18, 2021, 9:40 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నేతలతో పదో విడత చర్చలకు ముందు కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉభయపక్షాలు సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నాయని, అయితే ఇతర భావజాలం ఉన్న వ్యక్తులు కలగజేసుకోవడం వల్ల ఇది ఆలస్యమవుతోందని పేర్కొంది. రైతు నాయకులు తమకు అనుకూలంగా పరిష్కారాన్ని కోరుకుంటున్నారని తెలిపింది.

పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పర్షోత్తమ్ రుపాలా.. పరిష్కారం మాత్రం తప్పక లభిస్తుందని అన్నారు.

"రైతులు మాతో నేరుగా మాట్లాడితే వేరుగా ఉండేది. రైతు సంఘాల నేతలు కలగజేసుకున్నప్పుడు ఇది కష్టంగా మారుతోంది. రైతులతోనే చర్చిస్తే ఫలితం ఇంకా ముందుగా వచ్చేది. కొందరు వ్యక్తులు వేరే భావజాలంతో నిరసనల్లో పాల్గొంటున్నారు. వారికి అనుకూలంగా పరిష్కారం కావాలనుకుంటున్నారు. రెండు పక్షాలకు పరిష్కారం కావాలి. కానీ వారి దృక్కోణం వేరుగా ఉంది. అందుకే ఆలస్యమవుతోంది. పరిష్కారమైతే తప్పక లభిస్తుంది."

-పర్షోత్తమ్ రుపాలా, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు ప్రయోజనం కలిగిస్తాయని పునరుద్ఘాటించారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఓ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గతంలోనే ఈ చట్టాలు రావాల్సిందని అన్నారు. ఒత్తిడి వల్ల ఇతర ప్రభుత్వాలు వీటిని అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వమే ధైర్యంగా ముందడుగు వేసిందని తెలిపారు. మంచి జరిగేటప్పుడు అవాంతరాలు ఎదురవుతాయని చెప్పుకొచ్చారు.

పదో విడత చర్చలు..

కేంద్రం, రైతు సంఘాల మధ్య పదో విడత చర్చలు మంగళవారం జరగనున్నాయి. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఇందుకు వేదిక కానుంది. 41 సంఘాల నేతలు సమావేశానికి హాజరుకానున్నారు.

కమిటీ సమావేశం

రైతు సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తొలి సమావేశం మంగళవారం జరగనుంది. పూసా క్యాంపస్​లో భేటీ కానున్నట్లు కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని చెప్పారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

సాగు చట్టాల అమలుపై జనవరి 11న స్టే విధించిన సుప్రీంకోర్టు.. వివాద పరిష్కారానికి నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ మాన్ కమిటీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఘన్వత్​తో పాటు వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి, ప్రమోద్ కుమార్ జోషి ప్రస్తుతం కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చదవండి: కమిటీలోని ఆ నలుగురూ సాగు చట్టాలకు మద్దతుదారులే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.