కరోనా యోధులను స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. రాష్ట్ర, జిల్లా, పంచాయతీ స్థాయిలో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, కొవిడ్‌ను జయించిన వారిలో కొందరిని ఆహ్వానించాలని కోరింది. ఎక్కువ మంది సమక్షంలో వేడుకలు నిర్వహించకూడదని, నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
అయితే.. దేశభక్తి సందేశాలు, జాతీయ గీతాలు పాడటం, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయటం, ముఖ్యమైన కార్యాలయాల అలంకరణ, జెండా ఆవిష్కరణ మొదలైన కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని రాష్ట్రాలకు రాసిన లేఖలో హోంశాఖ తెలిపింది.
స్వాతంత్ర్య వేడుకల్లో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజింగ్ మొదలైన కొవిడ్ నియమాలను మరిచిపోకూడదని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
కొవిడ్ యోధులను గౌరవించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించడం ఇది రెండోసారి.
ఇదీ చదవండి:కర్ణాటక మంత్రివర్గ విస్తరణ నేడే!