ETV Bharat / bharat

5 వేల వాహనాలు చోరీ.. ఎట్టకేలకు చిక్కిన గజదొంగ - గజ దొంగని అరెస్ట్​ చేసిన దిల్లీ పోలీసులు

గత కొన్ని సంవత్సరాలుగా 5 వేల వాహనాలను దొంగిలించిన గజ దొంగను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాల అక్రమ రవాణాలో కూడా నిందితుడు కీలకంగా వ్యవహరించాడని పోలీసులు చెప్పారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవించినా.. ఈ గజ దొంగ తీరు మారలేదు.

interstate big thie
inter state big thief arrested by delhi police
author img

By

Published : Sep 5, 2022, 10:48 PM IST

దిల్లీ పోలీసులు ఓ గజ గొంగను అరెస్టు చేశారు. నిందితుడు 1998 నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల వాహనాలను దొంగతనం చేశాడు. ముఠా నాయకుడిగా ఉన్న 52 ఏళ్ల అనిల్​ చౌహాన్​.. 181 క్రిమినల్​ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలు మార్లు జైలుకు వెళ్లొచ్చినా అతడి తీరు మారలేదు. చివరికి మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అనిల్ చౌహాన్​ కాన్పుర్​లో నివాసం ఉంటున్నాడు. ఇతడి స్వస్థలం అసోంలోని తేజ్​పుర్​. అక్కడ ఖడ్గమృగం కొమ్ములు స్మగ్లింగ్ చేసేవాడు. ఇవే కాకుండా ఆయిధాలను అక్రమంగా రవాణా చేసేవాడు. ఇతడు అసోం ప్రభుత్వానికి క్లాస్​-1 కాంట్రాక్టర్​గా ఉండేవాడు. తర్వాత ఈడీ దాడులు చేసింది. ఆస్తులను జప్తు చేసి వేలం వేసింది. ఆ తర్వాత నుంచి అతడు దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల దిల్లీ తదితర ప్రాంతాల్లో ఆయుధాల అక్రమ రవాణా ఎక్కువైన కారణంగా ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయని డీసీపీ శ్వేతా చౌహాన్​ తెలిపారు. నిందితుడి గురించిన సమాచారం స్పెషల్​ టీంల ద్వారా తెలిసిందని, ఆగస్టు 23న అతడిని అరెస్ట్​ చేశామని చెప్పారు. నిందితుడు 2015లో ఓ ఎమ్మెల్యేతో పాటు అరెస్టు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.

"నిందితుడు అనిల్​ చౌహాన్​ను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశాం. అతడిని అరెస్టు చేసి ఒక నాటు తుపాకి, రెండు క్యాట్రిడ్జ్​లు, ఒక దొంగిలించిన మోటార్​ సైకిల్ స్వాధీనం చేసుకున్నాం. విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడి వద్ద నుంచి మరో 5 నాటు తుపాకులు, 5 క్యాట్రిడ్జ్​లు, ఒక దొంగతనం చేసిన కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడు నిజాముద్దీన్​ పోలీస్​ స్టేషన్​లో నమోదైన కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు." అని డీసీపీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి: స్కూల్ ఆవరణలో పిల్ల ఏనుగు హల్​చల్.. దారి తప్పి..!

పులికే పంజా విసిరి.. కుమారుడ్ని కాపాడుకున్న మహిళ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.