ETV Bharat / bharat

చిన్న సంకల్పంతో గొప్ప ఆవిష్కరణ - smart shoes for blind

వారికి వచ్చిన చిన్న ఆలోచనతో దివ్యాంగులు కోసం గొప్ప ఆవిష్కరణే చేశారు ఈ చిన్నారులు. రోడ్డు పై వెళ్తుంటే రోజు జరిగే సంఘటనల నుంచి ప్రేరణ పొందారు. పాఠశాలలో ఉండే 'అటల్​ పరిశోధనాలయం'లో ఉండే పరికరాలతో మెదడుకు పని పట్టారు. ఫలితంగా అంధుల కోసం స్మార్ట్​ బూట్లు, కళ్లద్దాలను రూపొందించి అందరిని అబ్బురపరిచారు.

Innovative idea of ​​children made smart shoes, smart glasses for the blind people
చిన్న సంకల్పంతో గొప్ప ఆవిష్కరణ..
author img

By

Published : Dec 2, 2020, 11:41 AM IST

చిన్న సంకల్పంతో గొప్ప ఆవిష్కరణ..

మనుషులు రెండు రకాలు. గుంపులో కలిసిపోయి, అందరితోపాటే నడిచేవారు ఒకరకమైతే, మిగతావారి కంటే భిన్నమైనదేదైనా చేసి, ప్రత్యేకంగా నిలిచేవారు రెండోరకం. సామ్రాట్, రజనీష్ ఆ రెండోకోవకే చెందుతారు. ఈ కథ మాత్రం వీళ్లిద్దరిది కాదు. వాళ్లు తయారుచేసిన స్మార్ట్ బూట్లు, కళ్లద్దాలది. చూపులేని వారి కోసం ఈ పిల్లలు తయారుచేసిన పరికరాలివి. ఆ కథేంటో చూద్దామా?

ఓరోజు సామ్రాట్, రజనీష్ బడికి వెళ్తుండగా... ఓ పెద్దాయన వాళ్లముందే రోడ్డుపై పడిపోయాడు. ఎందుకు పడిపోయారని అడిగితే, తాను చూడలేనని సమాధానం చెప్పాడు. అది విని, బాధపడ్డ స్నేహితులిద్దరూ అలాంటివాళ్ల కోసం ప్రత్యేక కళ్లజోడు, బూట్లు తయారుచేయాలని నిర్ణయించుకున్నారు.

నేను, నా స్నేహితుడు పాఠశాలకు వస్తుండగా...దారిలో ఓ చూపులేని వ్యక్తి కిందపడిపోయాడు. ఆయన్ను పైకి లేపి, అలా ఎందుకు పడిపోయారని అడిగాం. నేను చూడలేనని చెప్పాడాయన. మాకు బాధగా అనిపించింది. అలాంటివాళ్లకు మేలు చేసే పరికరం తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది.

-సామ్రాట్ బోస్, విద్యార్థి

ఓ ఆలోచనతో విద్యార్థులు నావద్దకు వచ్చారు. అంధులు నడిచేందుకు సహకరించే ప్రత్యేక కళ్లజోడు తయారుచేస్తామని చెప్పారు.

-బీకే సింగ్, ఉపాధ్యాయుడు

ఈ బూట్లు, కళ్లజోళ్లలో ఉండే సెన్సర్లు....వాటిని ధరించిన వ్యక్తి ఏదైనా అవరోధానికి 3 మీటర్ల దూరంలో ఉండగానే అప్రమత్తం చేస్తాయి. వీటి సాయంతో, చూపులేనివారు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలరు.

బూట్లలో అల్ట్రాసోనిక్ సెన్సర్‌ అమర్చాం. ఏ అవరోధాన్నైనా ఇది గుర్తిస్తుంది. వెనక ఉండే అవరోధాలను కూడా గుర్తించేందుకు షూ వెనక భాగంలోనూ ఓ సెన్సర్‌ను పెట్టే ఆలోచనలో ఉన్నాం.

-రజనీష్ రంజన్, విద్యార్థి

దారిలో ఏదైనా అవరోధం వస్తే, గ్యాడ్జెట్‌లోని సెన్సర్ గుర్తించి, బజర్‌ మోగుతుంది. కొన్నిసార్లు చూపులేనివాళ్లు స్తంభాలకు గుద్దుకోవడం లాంటివి జరుగుతాయి. వారికి ఈ గ్యాడ్జెట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

-సామ్రాట్ బోస్, విద్యార్థి

తమకోసం తయారుచేసిన గ్యాడ్జెట్ల పట్ల, చూపులేనివాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి బాగున్నాయని, తమకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నారు.

ఇది ఉపయోగకరమే. ముందే జాడ తెలిస్తే, ప్రమాదాన్ని తప్పించుకోవడం సులభమవుతుంది.

-కింటు మహతో, దివ్యాంగ ఉపాధ్యాయుడు

భద్రత పరంగా ఈ పరికరం చాలా ఉపయోగకరం. ఇతరులను సహాయం కోసం అడగాల్సిన అవసరం ఉండదు.

-బలరాం, దివ్యాంగ ఉపాధ్యాయుడు

అవసరం ఆవిష్కరణలకు మూలం. రజనీష్, సామ్రాట్ల కళ్లు కూడా మనం నిత్యం చూసే సంఘటనలనే చూశాయి. కానీ మిగతావారిల, వదిలేసి, ముందుకు సాగలేదు. వాళ్లిద్దరి కళ్లు మాత్రం అక్కడే ఆగిపోయాయి. ఓ అద్భుతమైన ఆవిష్కరణకు ప్రాణంపోశాయి.

ఇదీ చూడండి: రైతన్న ప్రయాణంలో భరోసా ఈ 'పల్లే సృజన'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.