ETV Bharat / bharat

వైవాహిక బంధాలను కాపాడుతున్న జడ్జి.. రాజీ కుదర్చడంలో జాతీయ రికార్డు!

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు పెద్దలు. ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటైన దంపతులు జీవితాంతం కలిసి ఉండాలి అనేది ఆనాటి మాట. ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు విడిపోవాలని కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన జంటలను తిరిగి ఒకటి చేసి ఓ న్యాయమూర్తి జాతీయ అవార్డును కూడా పొందారు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..

initiative of dhamtari judge stopped divorce in many cases
విడాకుల కేసులో న్యాయమూర్తి వినోద్ కుమార్ కలిపిన జంటలలో ఓ జంట​
author img

By

Published : Nov 13, 2022, 8:49 PM IST

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. ఒకసారి వివాహం చేసుకున్నాక ఏదేమైనా కలిసే జీవించాలని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పవిత్రమైన వివాహ బంధాన్ని తెంచుకోవటానికి ఒక్క క్షణం కూడా పట్టట్లేదు. కొంతమంది అయితే పెళ్లైన కొన్ని నెలలకే విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. ఇంకా చాలా జంటలు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయిస్తున్నాయి.

అయితే, విడాకులు తీసుకోవాలనుకుంటున్న జంటలను కలిపేందుకు ఓ న్యాయమూర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లోని ధమ్​తరి లోక్ అదాలత్ న్యాయమూర్తి వినోద్ కుమార్.. తమ దగ్గరికి విడాకుల కోసం వచ్చిన చాలా జంటలను ఒక్కటి చేశారు. వారికి వివాహ బంధం ప్రాముఖ్యతను తెలియజేసి కలిసి జీవించేలా చేశారు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న వృద్ధ దంపతులను సైతం ఏకం చేశారు. విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కిన వీరికి.. వివాహ బంధం కొనసాగించడం ఎంత ముఖ్యమో వివరించారు వినోద్ కుమార్. న్యాయమూర్తి మాటలు విన్న దంపతులు.. విడాకులపై వెనక్కి తగ్గారు. ఒకరికొకరు పూల మాల వేసుకుని ఇకపై జీవితాంతం కలిసే జీవించాలని ప్రమాణం చేసుకున్నారు.

ఇలా న్యాయమూర్తి వినోద్ కుమార్ అనేక కుటుంబాలను విడిపోకుండా రక్షించారు. లోక్​ అదాలత్​కు 43 కుటుంబ కలహాల కేసులు రాగా... అందులో 28 కేసుల్లో ఆయన రాజీ కుదిర్చారు. ఆయన రాజీకుదర్చడం వల్ల- ఎంతోకాలంగా విడాకులు కావాలని కోర్టులో పోరాడుతున్న దంపతులు, గతాన్ని మర్చిపోయి కలిసి జీవించటానికి సమ్మతించారు. దీంతో అందరూ జడ్జి వినోద్​ కుమార్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

initiative of dhamtari judge stopped divorce in many cases
లోక్ అదాలత్​లో రాజీ కుదర్చగా మళ్లీ ఒక్కటైన జంట

"వినోద్​ కుమార్​ ఇలా చేయటం ఇదేం మొదటిసారి కాదు. ఆయన చాలా విడాకుల కేసులో దంపతులను ఒక్కటి చేశారు. దీంతో చాలా జంటలు మళ్లీ తిరిగి ఒక్కటయ్యాయి. ఇలా ఒక రోజులో అత్యధిక జంటలను కలిపినందుకు జడ్జి వినోద్‌కుమార్‌కు జాతీయ అవార్డు సైతం లభించింది" అని పలువురు న్యాయవాదులు తెలిపారు.

విడాకుల విషయంలోనే కాక, ఇతర కేసుల్లోనూ మానవతా దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారు వినోద్ కుమార్. తనను కుమారుడు పట్టించుకోవట్లేదని కోర్టుకు వచ్చిన వృద్ధురాలికి న్యాయం చేశారు. వృద్ధురాలి కుమారుడు.. ఆమెకు ప్రతి నెలా రూ.3వేలు ఇవ్వాలని జడ్జి స్పష్టం చేశారు. అనంతరం ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుర్చీలోంచి దిగి.. చేతులు జోడించి ఆమెకు నమస్కరించారు.

ఇవీ చదవండి:కూరగాయలతో పేపర్ తయారీ.. విద్యార్థి వినూత్న ప్రయత్నం.. త్వరలో నాచుతోనూ..

భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారం.. యువతిని కిడ్నాప్ చేసి 5 రోజులు గ్యాంగ్​రేప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.