దేశంలో కొవిడ్(Covid cases in India) ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. వరుసగా మూడో రోజూ 2 లక్షల దిగువన కరోనా కేసులు (covid cases) నమోదయ్యాయి. కొత్తగా 1,65,553 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,78,94,800
- మొత్తం మరణాలు: 3,25,972
- కోలుకున్నవారు: 2,54,54,320
- యాక్టివ్ కేసులు: 21,14,508
ఇదీ చదవండి: Covid-19: కరోనాను జయించిన వందేళ్ల దంపతులు
34.11 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా శనివారం 20,63,839 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 34,31,83,748కి చేరినట్లు చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: Vaccination: 'స్టార్ హోటళ్లలో టీకాలు వద్దు'
వ్యాక్సినేషన్..
ఒక్కరోజే 30,35,749 వ్యాక్సిన్ డోసులు (vaccination) అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 21,20,66,614కు చేరినట్లు చెప్పింది.
ఇదీ చదవండి: Covid vaccine: బూస్టర్ డోసు అవసరమా?
ఇదీ చదవండి: తమిళనాడుపై కరోనా పంజా- మరో 30 వేల కేసులు