infant murder: ఏడు నెలల పసికందును దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. చిన్నారిని కిడ్నాప్ చేసి అనంతరం చంపేశాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో ముంబయి గోరేగావ్ ఫిలింసిటీలో కూలీగా పనిచేస్తున్న కన్నన్ ముత్తుస్వామిని నిందితుడిగా గుర్తించారు పోలీసులు. అతడ్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ముత్తుస్వామి చంపింది అతని ప్రేయసి సోదరుడ్నే అని పోలీసులు వెల్లడించారు.
ముత్తుస్వామి, ఓ అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని.. అయితే ప్రియురాలి తల్లి వీరి ప్రేమను అంగీకరించలేదని వివరించారు. దీంతో ఆగ్రహించిన అతడు మృణాల్ గోర్ వంతెన కింద ప్రియురాలి ఇంటి నుంచి 7 నెలల పసికందును అపహరించి.. ఆ తర్వాత హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోరేగావ్‌లోని బాంబే వెటర్నరీ కళాశాల సమీపంలోని నీటి ట్యాంక్‌లో పడేశాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని వాన్రై పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్స్‌తో కలిసి కన్నతల్లి హత్య.. కారణం తెలిస్తే షాక్!