ETV Bharat / bharat

'ఆ స్టేడియానికి వస్తే బాంబు పేలుస్తాం'.. భారత్ జోడో యాత్రకు బెదిరింపు లేఖ - భారత్ జోడో యాత్ర లేటెస్ట్​ న్యూస్​

భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు.

Rahul Gandhi receives bomb threat
Rahul Gandhi receives bomb threat
author img

By

Published : Nov 18, 2022, 10:37 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్‌ జోడో యాత్రకు బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రోజుల్లో ఆ పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుండగా అక్కడ బెదిరింపు లేఖ దొరకడం కలకలం రేపుతోంది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు.

Rahul Gandhi receives bomb threat in Indore
యజమానికి వచ్చిన బెదిరింపు లేఖ

"గురువారం సాయంత్రం జుని ప్రాంతంలోని ఒక దుకాణానికి ఒక లేఖ వచ్చింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న జోడోయాత్రలో పాల్గొనేవారు ఖల్సా స్టేడియంలో బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఆ లేఖ సారాంశం. అయితే రాహుల్ లక్ష్యంగా చేసుకున్నట్లు దానిలో నేరుగా ప్రస్తావించలేదు. దీనిపై మేం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం" అని తెలిపారు. అలాగే దీన్నొక బూటకపు బాంబు బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బెదిరింపు లేఖ

ఈ లేఖపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే జోడోయాత్రకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ యాత్ర సాగుతోంది. దీనిలో భాగంగా ఇటీవల ఓ సభలో హిందుత్వ సిద్దాంతకర్త సావర్కర్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాటికి నిరసనగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఇక నవంబర్ 20కి ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.