కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వార్షిక స్వచ్ఛత సర్వేలో మరోమారు దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్(Indore cleanest city). వరుసగా ఐదోసారి క్లీనెస్ట్ నగరంగా ఘనత(cleanest city in india ) సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్-2021లను((swachh survekshan 2021)) శనివారం ప్రకటించింది కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ.
పరిశుభ్రమైన నగరాల జాబితాలో రెండో స్థానంలో గుజరాత్‌లోని సూరత్, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నిలిచాయి. మహారాష్ట్రలోని నావీ ముంబయి తన స్థానాన్ని కోల్పోయింది. తాజా జాబితాలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 'స్వచ్ఛమైన గంగా నగరం'గా వారణాసికి అవార్డు లభించింది.
రాష్ట్రాల జాబితాలో..
అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ అవార్డును(cleanest state in india ) కైవసం చేసుకుంది. 100కుపైగా పట్టణాలున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు రాష్ట్రాల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో.. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను విజేతలకు అందించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
4,320 నగరాలపై సర్వే..
స్వచ్ఛా సర్వేక్షణ్ అవార్డ్స్-2021లో దేశవ్యాప్తంగా 4,320 నగరాలపై 28 రోజుల పాటు సర్వే నిర్వహించింది కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ. 4.2 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది.
- 100లోపు పట్టణాలు కలిగిన రాష్ట్రాల్లో ఝార్ఖండ్ తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా, గోవాలు ఉన్నాయి.
- ఒక లక్షకుపైగా జనాభా కలిగిన పట్టణాల్లో టాప్-10లో ఇండోర్, సూరత్, విజయవాడ, నావీ ముంబయి, దిల్లీ, అంబికాపుర్, తిరుపతి, పుణె, నొయిడా, ఉజ్జయనీలు ఉన్నాయి. లఖ్‌నవూ 25వ స్థానంతో సరిపెట్టుకుంది.
- లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని విటా సిటీ.. తొలి ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత లోనావాలా, సస్వాద్లు నిలిచాయి.
- పరిశుభ్రమైన చిన్న నగరాల జాబితాలో దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ తొలి స్థానంలో నిలిచింది. ఫాస్టెస్ట్ మూవర్ స్మాల్ సిటీగా హొశంగవాడ.. ప్రజలకు నచ్చిన బెస్ట్ స్మాల్ సిటీగా త్రిపుటిలు నిలిచాయి. పరిశుభ్రమైన మధ్యంతర నగరంంగా నొయిడా నిలిచింది.
- సఫాయిమిత్రా సురక్షా ఛాలెంజ్‌లో నావీ ముంబయి తొలి ర్యాంక్ సాధించింది. 10-40 లక్షల జనాభా గల నగరాల్లోనూ తొలిస్థానం కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి: స్వచ్ఛ నగరాల జాబితాలో ఇండోర్ మళ్లీ నెం.1