ETV Bharat / bharat

స్వదేశీ శక్తి: సముద్ర జలాల్లోకి సరికొత్త 'విక్రాంత్'​ - విక్రాంత్​ యుద్ధనౌక

స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక విక్రాంత్​ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు నేవీ అధికారులు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ నౌక నేవీకి అందుబాటులో ఉంటుంది.

ins vikrant trials, ఐఎన్​ఎస్​ విక్రాంత్​
సముద్ర జలాల్లోకి సరికొత్త 'విక్రాంత్'​!
author img

By

Published : Aug 4, 2021, 3:26 PM IST

Updated : Aug 4, 2021, 4:16 PM IST

సముద్ర జలాల్లోకి సరికొత్త 'విక్రాంత్'​

భారత్​లో తయారు చేసిన తొలి యుద్ధ నౌక.. విక్రాంత్​ను నౌకాదళం బుధవారం సముద్రజలాల్లోకి ప్రవేశపెట్టింది. 1971 భారత్​-పాకిస్థాన్​ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఐఎన్​ఎస్​ విక్రాంత్​కు 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ఈ యుద్ధనౌకను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఓ చారిత్రక అడుగు అని పేర్కొన్నారు.

ఈ ఎయిర్​క్రాఫ్ట్​ కేరియర్​ తయారీతో స్వదేశీ పరిజ్ఞానంతో దీటైన యుద్ధనౌకలు ఉన్న దేశాల జాబితాలో భారత్​ చేరిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విక్రాంత్​.. భారత్​లో రూపొందించిన తొలి అతిపెద్ద యుద్ధనౌక అని తెలిపారు.

40వేల టన్నుల బరువు ఉండే ఈ నౌక నిర్మాణానికి రూ.23వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీ ట్రయల్స్​ సాగిస్తున్న ఈ నౌక.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో నేవీ సేవలకు అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం భారత్​కు ఎయిర్​క్రాఫ్ట్​ కేరియర్​గా ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఈ జాబితాలోకి విక్రాంత్​ చేరనుండటం వల్ల నౌకాదళానికి మరింత బలం చేకూరుతుంది.

ఇదీ చదవండి : 'స్వాతంత్ర్య వేడుకలకు కరోనా యోధులను ఆహ్వానించండి'

Last Updated : Aug 4, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.