అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులు(Indians in Afghanistan) సహా అక్కడి సిక్కులు, హిందువులను దిల్లీకి తరలించే ప్రక్రియకు 'ఆపరేషన్ దేవీ శక్తి' అని పేరు పెట్టారు. మంగళవారం మరో 78 మంది అఫ్గాన్ నుంచి భారత్ చేరుకున్న సందర్భంగా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
'ఆపరేషన్ దేవీ శక్తి కొనసాగుతుంది. కాబుల్‌లో(Kabul Airport) చిక్కుకున్న 78 మందిని వయా దుశాంబే భారత్‌కు తీసుకొచ్చాం. ఈ ప్రక్రియలో నిరంతరాయంగా శ్రమిస్తున్న భారత వాయుసేన, ఎయిర్ ఇండియా, విదేశాంగ శాఖ బృందానికి సెల్యూట్' అని జైశంకర్ ట్వీట్ చేశారు.
భారత్ ఇప్పటివరకు 800కిపైగా మందిని అఫ్గాన్ నుంచి తీసుకొచ్చింది. వీరిలో భారతీయులతో పాటు అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు.
అఫ్గాన్‌ను తాలిబన్లు(Afghan Taliban) తమ అధీనంలోకి తెచ్చుకున్న మరునాడు ఆగస్టు 16 నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. మొదట 40 మందిని ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి తీసుకొచ్చింది.
ఇదీ చూడండి: Afghan News: అఫ్గాన్ నుంచి భారత్ చేరుకున్న మరో 78 మంది