ETV Bharat / bharat

రూ.2000 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత - తమిళనాడు

అక్రమంగా తరలిస్తున్న 300కిలోలకు పైగా ఉన్న కొకైన్ను డైరక్టర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు..తమిళనాడులోని టుటికొరిన్ పోర్టులో స్వాధీనం చేసుకున్నారు. వాటివిలువ రూ.2000కోట్లు ఉంటుందని వెల్లడించారు.

cocaine
కొకైన్
author img

By

Published : Apr 21, 2021, 10:45 PM IST

అక్రమంగా తరలిస్తున్న రూ.2000కోట్ల విలువైన 300కిలోల కొకైన్​ను తమిళనాడులోని టుటికొరిన్ పోర్టులో డైరక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్(డీఆర్ఐ)అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ ఉన్న ఆ కంటైనర్ పనామా నుంచి అంతేర్ప్, కొలంబో మీదుగా టుటికొరిన్ వచ్చినట్లు తెలిపారు.

కొకైన్
కొకైన్

ఆ కంటైనర్ కర్రల లోడుతో ఉందని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. కర్రలమధ్య కొకైన్ మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారని పేర్కొంది. కొకైన్ బ్యాగ్ బరువు 303కిలోలు ఉన్నట్లు తెలిపింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఓ అధికారులు వెల్లడించారు.

అరికా నట్స్ పట్టివేత

పాన్ మసాలాలో ఉపయోగించే అరికా నట్స్ ను అక్రమంగా తరలిస్తుండగా మిజోరంలోని చంపాయ్ జిల్లాలో అసోం రైఫిల్స్ దళాలు పట్టుకున్నాయి. వాటివిలువ రూ.2కోట్లకు పైగా ఉంటుందని భద్రతా దళాలు పేర్కొన్నాయి.

అరికా నట్స్ అక్రమ రవాణా గురించి తెలుసుకున్న అసోం రైఫిల్స్, కస్టమ్స్ అధికారులు మంగళవారం, బుధవారం మిజోరం-మియన్మార్ సరిహద్దులోని రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు చేశారు. మంగళవారం ఖవ్ బుంగ్ గ్రామంలో తనిఖీలు చేయగా అరికా నట్స్ ఉన్న 954సంచుల్ని పట్టుకున్నారు. వాటి విలువ రూ.2.14కోట్లని తెలిపారు. కాగా బుధవారం రోజున చంపాయ్-మౌల్ కావీ రోడ్డులో అరికా నట్స్ ఉన్న మరో 50 సంచుల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటివిలువ రూ. 12లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. వాటిని మియన్మార్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: 'బీజాపుర్ అడవుల్లో డ్రోన్​ బాంబులు.. పోలీసుల పనే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.