ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు

దేశంలో పాజిటివిటీ రేటు 16.98 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు 14.66 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

corona
కరోనా
author img

By

Published : May 16, 2021, 4:48 PM IST

దేశంలో ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు తెలిపింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. పాజిటివిటీ రేటు 16.98 శాతానికి తగ్గిందని పేర్కొంది. కొత్తగా 55,344 కేసులు తగ్గి యాక్టివ్ కేసుల సంఖ్య 36,18,458 చేరుకుందని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 14.66 శాతంగా ఉన్నాయని వెల్లడించింది.

కేవలం 10 రాష్ట్రాల్లోనే 74.69 శాతం యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,62,437 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 2,07,95,335 కు చేరుకుంది. 10 రాష్ట్రాల్లోనే 70.94శాతం రికవరీలు నమోదయ్యాయి.

దేశంలో కొత్తగా 4,077 మరణాలు సంభవించగా.. కేవలం పది రాష్ట్రాల్లోనే 75.55 శాతం మరణాలు నమోదయ్యయి.

మూడు రోజుల్లో 51లక్షల డోసులు:

దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా కేసులు నానాటికీ పెరుగుతుంటే మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కరోనా కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తుండటంతో వ్యాక్సిన్‌ తీసుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. రాబోయే మూడు రోజుల్లో 51లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకూ 20కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

మే 14వ తేదీ వరకూ 18.43కోట్ల వ్యాక్సిన్‌ డోసులు(వృథాతో కలిపి) అందించారు. 'ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1.84కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. పలు రాష్ట్రాలు తమ వద్ద వ్యాక్సిన్‌ డోస్‌లు కొరత ఉన్నట్లు చూపిస్తున్నాయి. పూర్తి వివరాలను మరోసారి పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరో మూడు రోజుల్లో 50,95,640 వ్యాక్సిన్‌ డోస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం' అని కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 120 ఏళ్ల క్రితమే దేశంలో లాక్​డౌన్

:సరిహద్దులో పసుపు రంగు లైట్- పాక్​ కొత్త కుట్రా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.