ETV Bharat / bharat

మీ ఫోన్​కు రోజులో 12 ఫేక్​ మెసేజ్​లు! టచ్ చేస్తే ఖతమే! అవేంటో తెలుసా?

Indian Users Receiving 12 Cyber Fraud Messages Daily : టెక్నాలజీలో ఏ స్థాయిలో పెరుగుతోందో.. సైబర్​ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఎంతగా అంటే.. స్మార్ట్​ ఫోన్​ వినియోగదారులకు ఒక రోజులో.. సగటున 12 ఫేక్ మెసేజ్​లు వస్తున్నాయట! అందులో 7 అత్యంత హానికరమైనవట! మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Indian Users Receiving 12 Cyber Fraud Messages Daily

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 12:46 PM IST

Indian Users Receiving 12 Cyber Fraud Messages Daily : ఆన్​లైన్​ బ్యాంకింగ్, యూపీఐ వినియోగం పెరిగినప్పటి నుంచి.. సైబర్ మోసాలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనాలను మోసం చేసేందుకు స్కామర్లు.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. వీటిపై పెద్దగా అవగాహన లేని సామాన్యులతోపాటు బాగా చదువుకున్నవారు సైతం ఈ రకం మోసాలకు బలవుతున్నారు. డబ్బు పోగొట్టుకుంటున్నారు. అయితే.. ముఖ్యంగా ఫోన్లకు వచ్చే కొన్ని ఫేక్ మెసేజ్‌లు, వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారని.. ప్రముఖ కంప్యూటర్​ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) చెబుతోంది.

మెకాఫీ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ స్కామ్ మెసేజ్ స్టడీలో.. విస్తుపోయే విషయాలను వెల్లడించింది. ఈ-మెయిల్, సాధారణ మెసేజ్​లు, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ ద్వారా ప్రతిరోజూ ఒక్కో వ్యక్తికి.. దాదాపుగా 12 ఫేక్ మెసేజ్‌లు వస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు, ఆఫర్లు, బ్యాంక్ అలర్ట్స్ వంటి వివిధ రూపాల్లో మోసగాళ్లు చెలరేగిపోతున్నట్లు పేర్కొంది. ఇందులో.. 7 ఫేక్ మెసేజ్‌లు అత్యంత ప్రమాదకరమైనవి ఉంటున్నాయట. మరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Android Phones Security Risk : ఆండ్రాయిడ్ యూజర్స్​కు అలర్ట్​.. ఫేక్​ టెలిగ్రామ్​, సిగ్నల్​ యాప్స్​తో​.. జర జాగ్రత్త!

  • ఫేక్ జాబ్స్ : మంచి ఆఫర్లతో జాబ్​ ఇస్తాం.. ఈ లింక్​ క్లిక్​ చేయండి అంటూ మెసేజ్ పంపుతారు. తెలియని వారి నుంచి వచ్చే.. ఇలాంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను జాబ్ పోర్టల్స్‌లో మాత్రమే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో లేదా మీ వాట్సాప్‌కు వచ్చే జాబ్ ఆఫర్ మెసేజ్‌లు, SMSలను నమ్మకూడదు. ఏ కంపెనీ కూడా మెసేజ్‌ల ద్వారా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోదు.
  • ప్రైజ్ : మీకు ఒక ప్రైజ్ వచ్చింది, భారీగా డబ్బు గెల్చుకున్నారు అనే మెసేజ్‌.. అందరి ఫోన్లకూ ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ప్రజలను బురిడీ కొట్టించడానికి స్కామర్లు పంపే మెసేజ్ ఇది. ఇలాంటి మెసేజ్​లో ఉండే లింక్​పై క్లిక్ చేస్తే.. మన వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు మోసగాళ్ల చేతికి చిక్కడానికి 99% అవకాశం ఉంది.
  • OTT సబ్‌ స్క్రిప్షన్ అప్‌డేట్స్ : ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌పామ్స్‌కు ఆదరణ పెరగడంతో.. స్కామర్లు నెట్‌ఫ్లిక్స్ లేదా ఇతర OTT సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్ అంటూ ఫేక్ మెసేజ్‌లు పంపుతున్నారు. సబ్‌స్క్రిప్షన్ టైమ్ అయిపోతోందని, ఈ లింక్ క్లిక్ చేస్తే ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్ వస్తుందని స్కామర్లు ఊరిస్తుంటారు.

Deep Fake Video Call Scam : అర్జెంట్​గా డబ్బులు కావాలని ఫ్రెండ్​ కాల్​ చేశాడా?.. అది డీప్​ ఫేక్ స్కామ్ కావచ్చు! జాగ్రత్త!

  • KYC ఫ్రాడ్ లింక్స్ : కేవైసీ ఫ్రాడ్స్‌ చేసేవారు యూజర్లకు పంపే మెసేజ్‌లో ఫేక్ లింక్ సెండ్ చేస్తారు. ఈ url/లింక్ ద్వారా KYCని పూర్తి చేయమని అడుగుతారు. బ్యాంకు నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు నమ్మిస్తారు.
  • అమెజాన్ సెక్యూరిటీ అలర్ట్ : అమెజాన్ సెక్యూరిటీ అలర్ట్ పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్, అకౌంట్‌కు సంబంధించిన ఫేక్ నోటిఫికేషన్ వంటివి పెద్ద ట్రాప్. ఇలాంటి ముఖ్యమైన హెచ్చరికలను అమెజాన్ లేదా ఏదైనా ఈ-కామర్స్ కంపెనీ SMS లేదా వాట్సాప్‌లో పంపదు. యాప్స్‌లోనే వివరాలు కనిపిస్తాయి.
  • నకిలీ కొనుగోళ్లు : మీరు ఏ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయకపోయినా, మీకు ప్రొడక్ట్ పర్చేజింగ్, డెలివరీ అప్‌డేట్స్‌ను స్కామర్లు సెండ్ చేయవచ్చు. ఆర్డర్ ట్రాక్ చేయండి అంటూ.. వీరు సెండ్ చేసే లింక్స్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.
  • డెలివరీ నోటిఫికేషన్స్ : మీ డెలివరీ మిస్ అయ్యిందనీ, పలానా కారణంతో ఆలస్యమైందనో మెసేజెస్ వస్తాయి. వివరాల కోసం ఓపెన్ చేయండి అని లింక్ పంపిస్తారు. ఇవి కూడా ప్రమాదకరమైనవి.

WhatsApp Scams : వాట్సాప్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయ్!​.. జాగ్రత్తపడండి ఇలా!

గిఫ్ట్ కార్డ్​, క్యాష్​ బ్యాక్​ కోసం ఆశపడితే అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.