ETV Bharat / bharat

ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. చైనాకు తిరిగి వెళ్లేదెప్పుడు? - south korea president election 2022

Indian students in China return: కరోనా కారణంగా చైనా నుంచి తిరిగొచ్చిన భారత వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లుగా తిరిగి కళాశాలలకు వెళ్లలేని దుస్థితిలో ఉన్నారు. ఈ విషయంపై పలు కీలక విషయాలు వెల్లడించింది భారత విదేశాంగ శాఖ. చైనాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటనపై సమాచారం లేదని పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఇండియాకు రానున్నారు జపాన్​ ప్రధాని.

Indian students
వైద్య విద్యార్థులు
author img

By

Published : Mar 17, 2022, 9:06 PM IST

Indian students in China return: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తొలుత చైనాలో వెలుగు చూసింది. వైరస్​ వ్యాప్తి అధికమవుతున్న క్రమంలో ఆ దేశంలో చిక్కుకున్న భారత విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది కేంద్రం. రెండేళ్లు గడుస్తున్నా వైరస్​ ప్రభావం కొనసాగుతోంది. చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా నుంచి స్వదేశానికి చేరుకున్న భారత వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ చైనా ఎప్పుడు వెళ్లాలి, మధ్యలోనే ఆగిన చదువుల పరిస్థితి ఏమిటి? అనే విషయంలో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.

'భారత వైద్య విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసేలా తిరిగి వెళ్లేందుకు చైనా అంగీకరిస్తుందా?' అని అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్​ బాగ్చి.

"భారత విద్యార్థులు తిరిగి వెళ్లటంపై చైనా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన రాలేదు. మన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సానుకూల వైఖరిని అవలంబించాలని, విద్యార్థులు తిరిగివెళ్లేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చైనాను నిరంతరం కోరుతూనే ఉన్నాం. ఆంక్షలు విధించినప్పటి నుంచి చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లాం. విద్యార్థుల పరిస్థితి, ఆంక్షల కొనసాగింపుతో వారి విద్యాభ్యాసాన్ని ఏ విధంగా ప్రమాదంలో పడేస్తుందో తెలియజేశాం."

- అరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి.

మరోవైపు.. చైనా విదేశాంగ మంత్రి మార్చి చివరి వారంలో భారత పర్యటనకు వస్తున్నారన్న నివేదికలపై ప్రశ్నించగా.. ఆ అంశంపై ప్రస్తుతం తనకు సమాచారం లేదని చెప్పారు.

south korea president election 2022

దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడికి మోదీ ఫోన్​..

దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన యూన్​ సుకియోల్​తో గురువారం ఫోన్​లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​- కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటంపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ముఖ్యంగా ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్టా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన యూన్​కి శుభాకాంక్షలు తెలిపినట్లు పీఎంఓ పేర్కొంది.

japan pm india visit

భారతలో రెండు రోజుల పర్యటనకు జపాన్​ పీఎం

భారత్​లో రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 19న భారత్​కు రానున్నారు జపాన్​ ప్రధానమంత్రి పుమియో కిషిదా. 14వ భారత్​- జపాన్​ సదస్సును శనివారం మోదీ, కుషిదా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వెల్లడించారు విదేశాంగ మంత్రి బాగ్చి. భారత ప్రధాని ఆహ్వానం మేరకు మార్చి 19-20 మధ్య జపాన్​ ప్రధాని భారత్​లో అధికారిక పర్యటనకు వస్తున్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ సదస్సు మంచి అవకాశమన్నారు.

Scott Morrison

ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ భేటీ..

ఆస్ట్రేలియన్​ ప్రధానమంత్రి స్కాట్​ మారిసన్​తో మార్చి 21న వర్చువల్​గా సమావేశం కానున్నారు నరేంద్ర మోదీ. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే అవకాశాలపై నేతలు చర్చించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయని తెలిపారు ఆరిందమ్​ బాగ్చి.

హురియత్​ కాన్ఫరెన్స్​ను ఆహ్వానించటం సరికాదు: భారత్​

వచ్చే వారం ఇస్లామాబాద్​లో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆల్​ పార్టీ హురియత్​ కాన్ఫరెన్స్​ ఛైర్మన్​ను ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​(ఓఐసీ) ఆహ్వానించటాన్ని తప్పుపట్టింది భారత్​. ఉగ్రవాదం, భారత వ్యతిరేక చర్యల్లో పాల్గొనే వారిని ఓఐసీ ప్రోత్సహిస్తుందని భారత్​ అనుకోలేదన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి. భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడేందుకు తమ వేదికలను వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వొద్దని ఓఐసీకి పలు మార్లు సూచించినట్లు చెప్పారు.

శ్రీలంకకు 1 బిలియన్​ డాలర్ల రుణం..

సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్​ భారీ రుణ సాయం అందించనుందని ఆర్థిక శాఖ తెలిపింది. ఆహార పదార్థాలు, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువుల కొనుగోలు కోసం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఒక బిలియన్​ డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్​ రాజపక్సతో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, విదేశాంగ మంత్రి జైశంకర్​లు దిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పలు అంశాలపై మంత్రులు చర్చించారు. రుణ సౌకర్యంపై ఎస్​బీఐ, శ్రీలంక ప్రభుత్వం సంతకాలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. పెట్రోల్​ ఉత్పత్తులను కొనుగోలు చేసేందు.. ఇటీవలే 500 మిలియన్​ డాలర్ల రుణసాయం అందించింది ఎక్సిమ్​ బ్యాంక్​.

అది ఐసీజే జడ్జిల వ్యక్తిగతం..

అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తులు వారి వ్యక్తిగత సామర్థ్యం మేరకు ఓటు వేసే అవకాశం ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా భారత జడ్జి దల్వీర్​ భండారి ఓటు వేసిన మరుసటి రోజు ఈ మేరకు స్పష్టతనిచ్చింది. ఉక్రెయిన్​లో హింసాకాండను వెంటనే నిలిపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ఉక్రెయిన్​ వినతి మేరకు చర్యలు తీసుకునేందుకు అంగీకరించింది.

ఇదీ చూడండి: ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. సాయం కోసం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.