ETV Bharat / bharat

Indian Railways: పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు.. 'భారత్​ గౌరవ్​' - భారతీయ రైల్వే న్యూస్​

(Indian Railways) సరకు, ప్రయాణికుల రవాణాకు మాత్రమే పరిమితమైన భారతీయ రైల్వే.. టూరిజం కోసం ప్రత్యేకంగా రైళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం సుమారు 190 రైళ్లను గుర్తించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఈ రైళ్లు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Railways
రైలు, ఇండియన్​ రైల్వే, భారతీయ రైల్వే
author img

By

Published : Nov 23, 2021, 6:11 PM IST

భారత్​ గౌరవ్​ రైళ్ల పేరుతో భారతీయ రైల్వే 190 కొత్త ట్రైన్స్​ను(Indian Railways) దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు కేవలం సరకు, ప్రయాణికుల రవాణాకు మాత్రమే పరిమితమైన సంస్థ.. ఇప్పుడు మూడో సెగ్మెంట్​గా పర్యాటకాన్ని(irctc tourism) ప్రోత్సహించేలా థీమ్​ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఈ ట్రైన్స్​ను ప్రైవేట్​ సెక్టార్​తో పాటు ఐఆర్​సీటీసీ కూడా నడపుతుందని పేర్కొన్నారు.

"భారత్​ గౌరవ్​ రైళ్లు... సాధారణ ట్రైన్స్​లా టైం టేబుల్​ను అనుసరించవు. వీటి కోసం సుమారు 3,033 కోచ్​లను, 190 రైళ్లను గుర్తించాం. ప్రయాణికులు, సరకు రవాణా సెగ్మెంట్ల తర్వాత పర్యాటకం కోసం ఈ థీమ్​ ట్రైన్స్​ను ప్రారంభిస్తాం. ఈ రైళ్లు భారతదేశ గొప్పదనం, సంస్కృతితో పాటు ఔన్నత్యాన్ని ప్రతిభింబించేలా రూపొందిస్తున్నాము. వీటి కోసం మంగళవారం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం."

-కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​

దేశ ప్రజలు భారతదేశ ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు నడిచేలా ఈ థీమ్​ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ అన్నారు. వీటి ధరలను సంబంధిత సంస్థలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఇందులో అధిక ధరలు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఒడిశా, రాజస్థాన్​, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు మొగ్గు చూపిస్తున్నాయని చెప్పారు.

ఇదీ చూడండి: సెంట్రల్ విస్టా: ఉపరాష్ట్రపతి కొత్త నివాసానికి లైన్ క్లియర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.