ETV Bharat / bharat

రైల్వేలో 2.74 లక్షల ఖాళీలు.. భద్రతా విభాగంలోనే 1.7లక్షలకు పైగా..

Railway Vacancies 2023 : రైల్వే శాఖలో ఉన్న ఖాళీలపై కీలక విషయం వెల్లడైంది. రైల్వేలో మొత్తం 2.74 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 1.7 లక్షలకు పైగా భద్రత విభాగంలోనే ఉన్నాయని పేర్కొంది. ఓ ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు బదులుగా రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

indian-railway-vacancy-2023-more-than-2-lakh-posts-vacant-in-railways-response-to-an-rti-query
రైల్వేలో మొత్తం 2.74 లక్షల ఉద్యోగ ఖాళీలు
author img

By

Published : Jun 28, 2023, 10:29 PM IST

Indian Railway Vacancy 2023 : రైల్వేలో మొత్తం 2.74 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 1.7 లక్షలకు పైగా భద్రత విభాగంలోనే ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త చేసిన దరఖాస్తుకు బదులుగా రైల్వేశాఖ ఈ వివరణ ఇచ్చింది. గ్రూప్​ సీ, లెవల్​ 1, ఎంట్రీ లెవల్​ కేటగిరీల్లో 2023 జూన్ 1 నాటికి మొత్తం 2,74,580 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వెల్లడించింది.

భద్రత విభాగంలో మొత్తం 9.82 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని.. అందులో 8.04 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, వేగవంతమైన పదోన్నతులు, శిక్షణ తర్వాత ప్రధాన ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. రైల్వేలో 3.12 లక్షల నాన్​ గెజిటెడ్​ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు 2022 డిసెంబర్​లో పార్లమెంట్​ వేదికగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ ప్రకటించారు.

లోకో పైలట్లు, ట్రాక్​పర్సన్‌లు, పాయింట్‌మెన్, ఎలక్ట్రికల్ వర్క్‌లు, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్‌లు, ఇంజనీర్లు, టెక్నీషియన్‌లు, క్లర్క్‌లు, గార్డ్‌లు/ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్లు, టిక్కెట్ కలెక్టర్లు వంటి వారందరూ రైల్వే భద్రత విభాగంలో పనిచేస్తారు. వీరంతా ప్రత్యక్షంగా రైల్వే కార్యకలపాల్లో పాల్గొంటారు. ఇలాంటి కీలక పోస్టు​ల్లో కొరత ఉండటంపై రైల్వే యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిని తగిన స్థాయిలో భర్తీ చేయకపోడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్‌నెస్, సీనియర్ జూనియర్ సెక్షన్ ఇంజనీర్లు, గ్యాంగ్‌మెన్, టెక్నీషియన్లలో మరిన్ని పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

సిబ్బంది కొరతతో కింద స్థాయి ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆన్-గ్రౌండ్ సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వారు వెల్లడిస్తున్నారు. ఒక్కో ఉద్యోగి రోజూ 8 నుంచి పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వివరిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన ఉద్యోగమని, అంత దూరాన్ని కవర్​ చేయాలంటే అందుకు మరింత ఎక్కువ శ్రద్ధ అవసరమని వారు పేర్కొంటున్నారు.

2023 అక్టోబర్​ వరకు దాదాపు 1.52 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.38లక్షల మందికి నియామక పత్రాలు అందజేసినట్లు వారు వెల్లడించారు. అందులో 90వేల మంది విధుల్లో చేరారన్నారు. వీటిల్లో 90 శాతం ఉద్యోగాలు భద్రత విభాగంలో ఉన్నాయని అధికారులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.