Indian President: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగింది. దిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఎస్కే మిశ్ర, ఆయన వైద్య బృందం ముర్ముకు ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతం కాగా.. మధ్యాహ్నం 1:30 గంటలకు ముర్మును డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రపతికి కొద్దిరోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.
'ఈ రోజు ఆమెకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కొద్ది రోజులు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు' అని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. 64 ఏళ్ల ద్రౌపదీ ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా.. జూలై 25 2022న బాధ్యతలు చేపట్టారు.