ETV Bharat / bharat

రూ.3వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టివేత

ఓ ఫిషింగ్​ నౌకలో అక్రమంగా తరలిస్తోన్న విదేశీ మాదకద్రవ్యాలను నావికాదళం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్​లో సుమారు రూ.3000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇంతటి భారీ స్థాయిలో అక్రమ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం నౌకా చరిత్రలోనే ఇదే తొలిసారని నావికాదళ అధికారులు వెల్లడించారు.

Indian navy seizes Narcotics
మాదకద్రవ్యాల పట్టివేత
author img

By

Published : Apr 19, 2021, 5:37 PM IST

Updated : Apr 19, 2021, 8:30 PM IST

కేరళలో భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది భారత నావికాదళం. అరేబియా మహా సముద్రంలో ఓ మత్స్యకార నౌకలో అక్రమంగా తరలిస్తున్న రూ.3వేల కోట్ల విలువైన విదేశీ మాదక ద్రవ్యాలను సోమవారం సీజ్​ చేసినట్టు అధికారులు తెలిపారు.

భారత నావికాదళ యుద్ధనౌక 'ఐఎన్​ఎస్​ సువర్ణ' ఈ ఆపరేషన్​ను దిగ్విజయంగా నిర్వహించినట్టు సదరన్​ నావల్​ కమాండ్​(ఎస్​ఎన్​సీ) అధికారికంగా వెల్లడించింది. తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు సదరు నౌకను కొచ్చి ఓడరేవుకు తరలించినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: దిల్లీలో లాక్​డౌన్- లిక్కర్​ షాపుల ముందు భారీ క్యూ

"భారత నావికాదళ నౌక ఐఎన్​ఎస్​ సువర్ణ.. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్​ చేస్తున్న సమయంలో అనుమానాస్పద రీతిలో ఉన్న ఓ ఫిషింగ్​ పడవను గుర్తించింది. దానిపై దర్యాప్తు చేసేందుకు ఓడరేవు బృందంతో ప్రత్యేక సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టింది. తద్వారా 300 కిలోలకుపైగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది."

- సదరన్​ నావల్​ కమాండ్​

పట్టుబడిన మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇదే అత్యధికం..

నౌకాదళ చరిత్రలోనే.. పరిమాణం, విలువ పరంగా ఇంత భారీస్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని నావికాదళ ప్రతనిధి తెలిపారు. అంతేకాకుండా.. మక్రాన్​ తీరం నుంచి భారత్​, మాల్దీవులు, శ్రీలంక మార్గాల్లో అక్రమ తరలింపుల్లోనూ ఇదే గరిష్ఠమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

Last Updated : Apr 19, 2021, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.