Indian Navy Jobs 2023 10th Pass : ఇండియన్ నేవీ - అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద వివిధ నేవెల్ విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 362 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది భారత నౌకా దళం ( Indian Navy Tradesman Recruitment 2023 ). ఆగస్టు 26 నుంచి ప్రారంభమయిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది.
మొత్తం ఖాళీలు..
Indian Navy Vacancy 2023 : 362 పోస్టులు.
ఈ పోస్టులు..
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్- 338 పోస్టులు
- ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ( NAD-డాలీగంజ్)- 24 ఖాళీలు
అర్హతలు..
- అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
- గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగానికి సంబంధించి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
ఏజ్ లిమిట్..
Indian Navy Tradesman Age Limit : దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థులకు 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.
విభాగాలు..
Indian Navy Join : ఐటీఐకి సంబంధించి మొత్తం 52 విభాగాలవారు ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు..
Indian Navy Salary : రూ.18,000-రూ.56,900.
దరఖాస్తు రుసుము..
Indian Navy Tradesman Application Fee : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. పూర్తిగా ఉచితం.
ఎంపిక విధానం..
- రాతపరీక్ష
- మెడకల్ టెస్టు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
దరఖాస్తుకు చివరితేదీ..
Indian Navy Tradesman Apply Last Date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షా కేంద్రం..
Indian Navy Tradesman Exam Centre : కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ అండ్ నికోబార్ దీవులు రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో పరీక్షను నిర్వహిస్తారు. ఎగ్జామ్ సెంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు అడ్మిట్‌కార్డ్‌లో ఉంటాయి.
పరీక్షా సమయం..
Indian Navy Tradesman Exam : పరీక్ష సమయం 2 గంటలు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో రాతపరీక్షను నిర్వహిస్తారు.
ఇక్కడ పనిచేయాలి..!
Indian Navy Tradesman Mate Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ పరిధిలోని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద వివిధ నేవెల్ విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
వెబ్సైట్..
Indian Navy Website : పరీక్ష సిలబస్ సహా ఇతర ముఖ్య సమాచారం కోసం అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (ఇండియన్ నేవీ) అధికారిక వెబ్సైట్ https://karmic.andaman.gov.in/HQANCను లేదా www.joinindiannavy.gov.inను చూడవచ్చు.