Indian Navy Jobs 2023 : భారత నౌకాదళం 224 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగానికి ఎంపికైనవారికి శిక్షణ ఇచ్చి, తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి సబ్ లెఫ్టినెంట్ హోదాతోపాటు, ఆకర్షణీయ వేతనం సహా ప్రోత్సాహకాలు అందిస్తారు.
ఈ బ్రాంచీల్లో..
Indian Navy Jobs Posts : ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచీల్లో 224 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులు..
- పైలట్ - 20 పోస్టులు
- లాజిస్టిక్స్ - 20 పోస్టులు
- నేవల్ కన్స్ట్రక్టర్ - 20 పోస్టులు
- ఎడ్యుకేషన్ బ్రాంచ్ - 18 పోస్టులు
- జనరల్ సర్వీస్/ హైడ్రో క్యాడర్ - 40 పోస్టులు
- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) - 8 పోస్టులు
- నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ - 18 పోస్టులు
- ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) - 30 పోస్టులు
ఏజ్ లిమిట్..
అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 1999/2000 జులై 2 నుంచి 2003/2005 జనవరి/జులై 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హతలు(Indian Navy Jobs Eligibility)..
- వివాహం కాని స్త్రీ, పురుషులు మాత్రమే పై పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
- బీఎస్సీ, ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా, పీజీ డిప్లొమా(ఫైనాన్స్/ లాజిస్టిక్స్/ సప్లై చైన్ మేనేజ్‌మెంట్/ మెటీరియల్ మేనేజ్‌మెంట్), ఎమ్ఎస్సీ, ఎమ్ఎస్సీ(ఐటీ), ఎంబీఏ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అన్ని పోస్టులకు అకడమిక్స్‌లో (పది, ఇంటర్) 60 శాతం మార్కులు తప్పనిసరి.
ఎంపిక విధానం(Indian Navy Jobs Selection Process)..
- అకడమిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూ రౌండ్‌కు పంపిస్తారు.
- సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో మెరిట్ మార్కులు పొందినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
- ఎన్‌సీసీ(సీ) సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
జీతభత్యాలు(Indian Navy Jobs Salary)..
- ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి కేరళ ఎజిమాళలోని నేవల్ అకాడెమీలో 2024 జూన్ నుంచి 44 వారాలపాటు ట్రైనింగ్ ఇస్తారు.
- అనంతరం సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
- ఈ విధంగా ఉద్యోగాల్లో చేరినవారికి లెవెల్ 10 కింద రూ.56,100 బేసిక్ పే అందుతుంది.
- దీనికి తోడు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి.
- ఇవన్నీ కలుపుకొని ఉద్యోగంలో చేరిన తొలి నెల నుంచే అభ్యర్థులు రూ.1 లక్షకు పైగా జీతం పొందే అవకాశం ఉంది.
పదేళ్లు విధుల్లో..
- ఉద్యోగానికి ఎంపికైన వారి ప్రొబేషన్ పీరియడ్ రెండేళ్లు. కాగా, వీరు పదేళ్లు కచ్చితంగా విధుల్లో కొనసాగుతారు.
- అనంతరం ఉద్యోగి పనితీరు, సంస్థ అవసరాల మేరకు మరో నాలుగేళ్లు సర్వీసును పొడిగిస్తారు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి వైదొలగాలి.
అప్లికేషన్ లాస్ట్ డేట్..
Indian Navy Jobs Apply Last Date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 అక్టోబరు 29 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్..
నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్ https://www.joinindiannavy.gov.in/ను వీక్షించవచ్చు.
AIIMS Jobs 2023 : ఎయిమ్స్‌లో గ్రూప్ - ఏ, గ్రూప్ - బి పోస్టులు.. అప్లై చేసుకోండిలా!