ETV Bharat / bharat

11న వైద్య విధులు బహిష్కరించండి: ఐఎంఏ - ఐఎంఏ

ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలు కల్పించేలా తీసుకొచ్చిన నోటిఫికేషన్​కు వ్యతిరేకంగా ఒక రోజు ధర్నా చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. డిసెంబర్​ 11న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆధునిక వైద్యం చేసే వైద్యులందరూ విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

Indian medical Association
భారతీయ వైద్య సంఘం
author img

By

Published : Dec 2, 2020, 6:53 AM IST

ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించేలా ఇటీవల భారతీయ కేంద్ర వైద్య మండలి(సీసీఐఎం) తీసుకొచ్చిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ఒక్క రోజు ధర్నా చేపట్టనున్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) వెల్లడించింది. ఆధునిక వైద్యం చేసే వైద్యులందరూ డిసెంబరు 11న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అత్యవసర సేవలు, కొవిడ్‌ సంబంధ సేవలు మినహా ఇతర విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఆరోజు సాధరణ శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించరాదని నిర్దేశించింది.

దీంతోపాటు డిసెంబరు 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ బహిరంగ నిరసన చేపట్టాలని కోరింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 20 మందికి మించని బృందాలతో ధర్నా చేయాలని సూచించింది. దీన్ని ఆధునిక వైద్యం చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమంగా ఐఎంఏ పేర్కొంది.

ఇదీ చూడండి:ఔషధ వ్యవస్థ అనుసంధానాన్ని తప్పుబట్టిన ఐఎంఏ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.