ETV Bharat / bharat

భారత మీడియాపైనా చైనా గుర్రు - భారత మీడియాను కట్టడి చేయమన్న చైనా

మీడియాను కట్టడి చేయండని చైనా.. భారత్​ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అందుకు భారత్ నిరాకరించింది. మాది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.

India media is an agenda item in every round of India-China military talks
భారత మీడియాపైనా చైనా గుర్రు
author img

By

Published : Feb 23, 2021, 10:18 AM IST

తూర్పు లద్దాఖ్​లో సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు భారత్​, చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చలన్నింటిలోనూ.. డ్రాగన్​ సేనకు సంబంధించిన ఒక 'బలహీనత' కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ అంశంలో అనేక కోణాలను వెలుగులోకి తెస్తూ , తనను ఎండగడుతున్న భారత మీడియాను ఎలా కట్టడి చేయాలో తెలియక గందరగోళానికి లోనవుతున్నట్లు స్పష్టమైంది. "పది విడతలుగా జరిగిన సైనిక చర్చలన్నింటిలోనూ ఈ అంశాన్ని చైనా బృందం లేవనెత్తుతోంది మీ మీడియాను కట్టడి చేయండి అని వారు మన బృందాన్ని కోరుతూనే ఉన్నారు" అని విశ్వసనీయ వర్గాలు 'ఈటీవీ భారత్'​కు తెలిపాయి. మన అధికారులు ప్రతిసారీ మాది ప్రజాస్వామ్య దేశం. "ఇక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని వారికి తేల్చి చెప్పారు" అని పేర్కొన్నాయి. భారత​ మీడియా పనిచేసే తీరు చైనాకు పూర్తిగా బోధపడలేదని ఆ దేశం నుంచి వెలువడిన అనేక ప్రకటనలు కూడా సూచిస్తున్నాయి.

గత ఏడాది జూన్​ 15న గల్వాన్​ లోయలో రెండు దేశాల బలగాల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణపై చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్​ కర్నల్​ రెన్​ గువోషియాంగ్​ ఇటీవల మాట్లాడుతూ.. భారత మీడియాపై అసహనం వెళ్లగక్కారు. " నాటి ఘర్షణలో చైనా సైనికుల మరణాలపై వాస్తవాలను వక్రీకరించింది. ప్రపంచ దేశాలనూ తప్పుదోవ పట్టించింది. చైనా బలగాలను దుర్భాషలాడింది" అని పేర్కొన్నారు. డ్రాగన్​ తన అమర సైనికులను గౌరవించదని, వారి త్యాగాలకు గుర్తింపు ఇవ్వదని భారత మీడియాలో వచ్చిన విమర్శనాస్త్రాల కారణంగానే ఆ దేశం ఎట్టకేలకు నోరు విప్పిందని చెప్పారు. గల్వాన్​ ఘర్షణలో నలుగురు సైనికులు మరణించారని అంగీకరించాల్సి వచ్చిందన్నారు.

ఇదీ చూడండి: భారత గగనతలం మీదుగా ఇమ్రాన్​ విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.