ETV Bharat / bharat

'భాజపాకు ఓటేయకండి'- నందిగ్రామ్​లో టికాయత్​

బంగాల్ ​ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయత్​ నందిగ్రామ్​ వెళ్లారు. భాజపాకు ఓటెయొద్దని కోరారు.

Indian Kisan Union leader Rakesh Tikayat
నందిగ్రామ్‌లో రాకేశ్‌ టికాయిత్‌ !
author img

By

Published : Mar 13, 2021, 8:46 PM IST

Updated : Mar 13, 2021, 10:42 PM IST

బంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఇటీవల సీఎం మమతా బెనర్జీ గాయపడి ఆస్పత్రిలో చేరడం, సువేందు అధికారి, మమత మధ్య నందిగ్రామ్‌లో జరగబోయే రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ నందిగ్రామ్ వెళ్లారు. భాజపాకు ఓటేయొద్దని ప్రజల్ని కోరారు.

"కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు ఓటువేయకండి. మీ రాష్ట్రాన్ని రక్షించుకోండి. వారు(భాజపా) మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగితే.. పంటకు మద్ధతు ధర ఎప్పుడు ప్రకటిస్తారు? ధాన్యానికి రూ.1850 ధర ఎప్పుడు వస్తుంది? అని అడగండి."-రాకేశ్​ టికాయత్​, భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు.

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఇటీవల రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టికాయత్‌ శనివారం కోల్‌కతా చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ (మహా పంచాయత్‌)లో పాల్గొన్నారు. అక్కడి నుంచి నందిగ్రామ్‌ వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. అంతకు ముందు తృణమూల్​ నేతలతో సంభాషించారు.

తమ తదుపరి లక్ష్యం పార్లమెంట్​లో పంటను అమ్మడమేనని రాకేశ్​ టికాయత్​ స్పష్టం చేశారు. పార్లమెంటులో మార్కెట్​ పెడతామని హెచ్చరించారు. అంతేకాకుండా 3.5లక్షల ట్రాక్టర్లలతో 25 లక్షలమంది రైతు​లతో దిల్లీలో మళ్లీ అడుగుపెడతామన్నారు.

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలుగా కర్షకులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంతో 11 దఫాలుగా చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో ఈ అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో వేలాది మంది రైతులు దిల్లీ సరిహద్దుల్లోనే టెంట్‌లు వేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే, తమ ఆందోళనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్లి తమ ఉద్యమ గొంతుకను వినిపించి, భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: 'మమతపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవు'

ఇదీ చదవండి: 'మమతపై దాడి జరిగినట్టు ఆధారాల్లేవు'

Last Updated : Mar 13, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.