ETV Bharat / bharat

భారత్‌లో 50 లక్షల మందికి టీకా - 30కోట్ల మందికి టీకా లక్ష్యం

దేశంలో కొవిడ్​ మహమ్మారిని అంతం చేసే దిశగా చేపట్టిన వ్యాక్సినేషన్​ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటివరకూ 50లక్షల మందికి టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

indian corona vaccination drive is under progress over 50 lacks beneficiaries got vaccine
భారత్‌లో..50లక్షల మందికి టీకా పూర్తి!
author img

By

Published : Feb 6, 2021, 7:28 AM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ఇప్పుడిప్పుడే వేగాన్ని పుంజుకుంటోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 50లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్న దేశాల్లో భారత్‌ ముందుందని కేంద్రం తెలిపింది. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ ప్రక్రియ కాస్త మందకొడిగానే సాగింది. ప్రస్తుతం రోజూవారీ డోసుల సంఖ్య 5లక్షలకు పెరిగింది.

లక్ష్యం 30 కోట్లు..

జనవరి 16న దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కాగా, కేవలం 20రోజుల్లోనే 50లక్షల మందికి ఇవ్వగలినట్లు కేంద్రం ప్రకటించింది. శుక్రవారం.. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 11,814 కేంద్రాల్లో 5,09,893 మందికి టీకా అందించారు. 8 రాష్ట్రాల్లో దాదాపు 61శాతం మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ అందజేయగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం 11.9శాతం మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలిడోసు తీసుకున్న వారికి త్వరలోనే రెండో డోసు ఇచ్చే ఏర్పాట్లలో ఆయా ప్రభుత్వాలు నిమగ్నమయ్యాయి. జులై నాటికి దేశంలో 30కోట్ల మందికి టీకా అందించే లక్ష్యంగా భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 11.9కోట్ల మందికి..

కరోనా వైరస్‌ మహమ్మారి నిర్మూలనలో భాగంగా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్‌‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 67 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అత్యవసర వినియోగం కింద 7 వ్యాక్సిన్‌లు అనుమతి పొందాయి. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా 11కోట్ల 90లక్షల మంది టీకాలు తీసుకున్నారు. నిత్యం దాదాపు 45లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా అన్ని దేశాలకంటే ముందుంది. ఇప్పటికే అక్కడ 3కోట్ల 67లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది.

indian corona vaccination drive is under progress over 50 lacks beneficiaries got vaccine
భారత్‌లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోన్న తీరు ఇలా..

ఏ రాష్ట్రంలో ఎంతమందికి టీకా

దూసుకెళ్తున్న ఇజ్రాయెల్‌, యూఏఈ..

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అమెరికా ముందుండగా, చైనా, ఈయూ, బ్రిటన్‌ దేశాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగానే కొనసాగుతోంది. అయితే, ఇజ్రాయెల్‌లో అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ దాదాపు 60శాతం మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగలిగినట్లు సమాచారం. అంతర్జాతీయ నివేదిక ప్రకారం, అక్కడ ప్రతి వంద మందిలో 58మంది వ్యాక్సిన్‌ తీసుకోగా.. వీరిలో ప్రతి 37శాతం మంది తొలిడోసు, మరో 21శాతం మంది రెండు డోసులను తీసుకున్నారు. ఇక యూఏఈలోనూ ప్రతి వంద జనాభాలో 35మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు చైనాలోనూ భారీస్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ చేపడుతున్నప్పటికీ వాటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇప్పటికే అక్కడ మూడు కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: నకిలీ కరోనా టీకాల సరఫరా- 80 మంది అరెస్ట్​

కొవిడ్​ టీకాపై సంకోచమే అసలు సమస్య

'మార్చిలో వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్'

హెల్త్ కేర్ వర్కర్లకు ముగిసిన తొలిదశ వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.