ETV Bharat / bharat

Indian Coast Guard Jobs : డిప్లొమా, ఇంజినీరింగ్ అర్హతతో.. ఇండియన్​ కోస్ట్​గార్డ్​లో నావిక్​, యాంత్రిక్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా! - జాబ్​ న్యూస్​ టుడే 2023

Indian Coast Guard Jobs In Telugu : ఇండియన్ కోస్ట్ గార్డ్​ (ICG) 350 నావిక్​, యాంత్రిక్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

ICG Recruitment 2023
Indian Coast Guard Jobs
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 10:29 AM IST

Indian Coast Guard Jobs : భారత తీరరక్షక దళంలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ 350 నావిక్​ (జనరల్ డ్యూటీ), నావిక్​ (డొమెస్టిక్​ బ్రాంచ్​), యాంత్రిక్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 22లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
ICG Recruitment 2023 For Navik And Yantrik Jobs :

  • నావిక్​ (జనరల్ డ్యూటీ) - 260 పోస్టులు
  • నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) - 30 పోస్టులు
  • యాంత్రిక్​ (మెకానికల్​) - 25 పోస్టులు
  • యాంత్రిక్​ (ఎలక్ట్రికల్​) - 20 పోస్టులు
  • యాంత్రిక్​ (ఎలక్ట్రానిక్స్​) - 15 పోస్టులు
  • మొత్తం - 350 పోస్టులు

విద్యార్హతలు
Indian Coast Guard Qualification :

  • నావిక్​ (డొమెస్టిక్ బ్రాంచ్​) : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • నావిక్​ (జనరల్ డ్యూటీ) : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డ్ నుంచి 10+2 క్వాలిఫై అయ్యుండాలి.
  • యాంత్రిక్ పోస్టులు : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. లేదా ఎలక్ట్రికల్​, మెకానికల్​, ఎలక్ట్రానిక్స్​, టెలికమ్యునికేషన్ (రేడియో/ పవర్​) ఇంజినీరింగ్ చేసి ఉండాలి.

వయోపరిమితి
Indian Coast Guard Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము
Indian Coast Guard Fee : అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక విధానం
Indian Coast Guard Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తరువాత అసెస్​మెంట్​/ అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
Indian Coast Guard Salary :

  • నావిక్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ శాలరీగా రూ.21,700 చెల్లిస్తారు.
  • యాంత్రిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.29,200 అందిస్తారు.

దరఖాస్తు విధానం
Indian Coast Guard Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://joinindiancoastguard.cdac.in వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • హోమ్​ పేజ్​లోని 'Join ICG as Enrolled Personnel' ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • Online application for DGEPT-01/2024 batch లింక్​పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు మీద రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • విద్యార్హత పత్రాలు అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లో చెల్లించి, దరఖాస్తును సబ్​మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Indian Coast Guard Important Dates :

  • ఆన్​లైన్​ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 8
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 22

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.