ETV Bharat / bharat

చైనాకు ఝలక్​.. ఆ ఎన్నికల్లో భారత్​కు జైకొట్టిన ప్రపంచ దేశాలు - praveen sinha cbi

Interpol Election 2021: భారత్​ నుంచి ప్రవీణ్​ సిన్హా అనే అధికారి ఇంటర్​పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా నుంచి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో స్పెషల్​ డైరెక్టర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

praveen sinha, interpol
ఇంటర్​పోల్​కు ప్రవీణ్​ సిన్హా
author img

By

Published : Nov 25, 2021, 5:34 PM IST

Interpol Election 2021: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో స్పెషల్​ డైరెక్టర్​గా పని చేస్తున్న ప్రవీణ్​ సిన్హా (praveen sinha cbi).. ఆసియా ప్రతినిధిగా ఇంట్​పోల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇంటర్​పోల్​లోని ఈ ఉన్నత ప్యానెల్‌లో రెండు స్థానాలు ఖాళీ కాగా.. వాటికి ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానాలకు చైనా, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జోర్డాన్‌ నుంచి ప్రవీణ్​ సన్హాకు గట్టి పోటీ ఎదురైంది. చివరకు భారతీయ అభ్యర్థిగా ప్రవీణ్​ విజయం సాధించారు.

ఇస్తాంబుల్​లో ఇంటర్​పోల్​ (interpol news today) నిర్వహించిన 89 వ జనరల్​ అసెంబ్లీలో భాగంగా ఈ ఎన్నికలు నిర్వహించినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ దేశాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన కారణంగా ఈ విజయం దక్కిందని చెప్పారు. భారత్​తో స్నేహపూర్వకంగా మెలిగే దేశాలు, రాయబారులు, హై కమిషన్​ల నుంచి ఈ ఎన్నికకు మద్దతు లభించిందని వెల్లడించారు.

ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2022లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్​ సిన్హా ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.

195 సభ్య దేశాలు గల ఇంటర్‌పోల్‌లో 1949లో చేరింది భారత్. అంతర్జాతీయ నేరాలు, నేరస్థుల సమాచారాన్ని పంచుకోవడానికి సభ్య దేశాల్లోని పోలీసులకు ఇంటర్‌పోల్ సాయపడుతుంది. పాలకమండలి నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరానికోసారి జనరల్ అసెంబ్లీ సమావేశమవుతుంది. భారత్‌ 1997లో మాత్రమే ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ఈ సమావేశం ఇస్తాంబుల్​లో జరుగుతోంది.

ఇదీ చూడండి: ఉద్యోగులకు రెండు రోజులు ఎక్స్​ట్రా సెలవులు- అమ్మ, నాన్నతో గడిపేందుకే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.