ETV Bharat / bharat

సైనికుల పటిష్ఠ పహారా.. ప్రశాంతతకు ఆవల.. తుపాకుల గర్జన! - బోర్డర్​లో సైనికుల కష్టాలు

కశ్మీర్​లో పనిచేసే భద్రతా సిబ్బందిపై ఎప్పుడు ఏ ఉగ్రవాది దాడి చేస్తాడో తెలియదు. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా మంచు కొండల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. అయితే.. వారి అక్కడ ఏలా పహారా కాస్తారు.. వారి వ్యూహాలు ఎలా ఉంటాయి. వాటన్నింటిపై ఓ ప్రత్యేక కథనం మీ కోసం..!

indian army jammu kashmir border
కశ్మీర్​లో సైనిక సిబ్బంది
author img

By

Published : Nov 9, 2022, 7:05 AM IST

కశ్మీర్‌లో ప్రశాంతతకు ఆవల తుపాకులు గర్జిస్తున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి భద్రతా సిబ్బంది ఉగ్రవాదులతో పోరాడుతూనే ఉన్నారు. వణికించే చలిలో, కొండకోనల్లో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య ముష్కరుల దాడులను సమర్థంగా తిప్పికొడుతూ.. ఈ యజ్ఞాన్ని బలగాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తి, వ్యూహాలను అమలు చేస్తూ సైన్యం సరిహద్దు వెంబడి నిత్యం చేస్తున్న పోరాటంలో సానుకూలతలపై 'ఈటీవీ భారత్​' క్షేత్రస్థాయి కథనం..

'అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలతో ఉంటావ్‌'(టు బి ఎలర్ట్‌.. టు బి ఎలైవ్‌).. బాదామీబాగ్‌ కంటోన్మెంట్‌ ప్రధాన ద్వారంపై పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఈ నినాదం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. ఇటీవల బారాముల్లా జిల్లాలో ఓ ఇంట్లో ఉగ్రవాది దాగాడన్న సమాచారంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఉగ్రవాది చనిపోయి ఉంటాడని భావించి లోనికి వెళ్లారు. కానీ, అకస్మాత్తుగా శిథిలాల మధ్య నుంచి లేచిన ముష్కరుడు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు చనిపోయారు. ఇలాంటి ఉదంతాలు అనేకం. విపత్కర పరిస్థితుల మధ్య భద్రతా బలగాలు నిరంతరం ఉగ్రవేట కొనసాగిస్తూనే ఉన్నాయి. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఆపరేషన్లు కొనసాగించడం అత్యంత సవాల్‌తో కూడుకున్న పని అని అక్కడి అధికారులు చెబుతుంటారు.

indian army jammu kashmir border
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

అష్ట దిగ్బంధనం
భద్రతా బలగాలు ఇక్కడ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు కనిపిస్తునప్పటికీ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఉగ్రవాదులు విరుచుకుపడతారని తెలుసు. అందుకే దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌, రాష్ట్రీయ రైఫిల్స్‌ తదితరాలకు చెందిన బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. ఇందులో సుమారు లక్ష మంది శ్రీనగర్‌లోనే పనిచేస్తున్నారు. శ్రీనగర్‌ జనాభా 16 లక్షలు. అంటే సగటున ప్రతి 16 మందికి ఒకరి చొప్పున భద్రతా సిబ్బంది ఉన్నారన్నమాట. 29 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీనగర్‌లో 400లకు పైగా చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు వందల సంఖ్యలో అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్‌ ఆర్మ్‌డ్‌ వాహనాలు, వాటి వద్ద సాయుధ సిబ్బంది అడుగడుగునా కనిపిస్తుంటారు.

indian army jammu kashmir border
చొరబాట్లను అడ్డుకునేందుకు నియంత్రణ రేఖ వద్ద భద్రతా బలగాలు

అత్యాధునిక కంచె..
చొరబాట్లను అడ్డుకునేందుకు నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి అత్యధునిక కంచె వ్యవస్థ (యాంటీ ఇన్ఫిల్ట్రేషన్‌ అబ్స్టకిల్‌ సిస్టం)ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండంచెల్లో ముళ్లతోకూడిన వైర్‌, మధ్యలో విద్యుత్తు తీగ ఉంటాయి. దీనికి సీసీ కెమెరాలు, ఫ్లడ్‌లైట్లు అనుసంధానం చేసి ఉంటాయి. అలానే మోషన్‌ సెన్సర్లు కూడా బిగించి ఉంటాయి. వీటి సమీపంలోకి ఎవరైనా వస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. ఈ వ్యవస్థకు సిస్మిక్‌ సెన్సర్లు కూడా తోడయ్యాయి. సున్నితమైన శబ్దాలను ఇవి పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి. హ్యాండ్‌ హెల్డ్‌ థర్మల్‌ ఇమేజ్‌ డివైజ్‌లను కూడా భద్రతా సిబ్బందికి సమకూర్చారు. వీటి ద్వారా చిమ్మచీకట్లో కూడా ఎదురుగా చాలా దూరంలో ఉన్న వారిని చూడొచ్చు. మంచులోనూ ఇది పనిచేస్తుంది. మొత్తంగా ఈ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా మార్చే పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

సింహస్వప్నం కె-ఫోర్స్‌
ముష్కరుల గుండెల్లో కె-ఫోర్స్‌ దడ పుట్టిస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడేందుకు 1990లో రాష్ట్రీయ రైఫిల్స్‌ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం 75 వేల మంది పనిచేస్తున్నారు. ఇందులోనూ వివిధ ప్రాంతాల కోసం చొరబాటు నిరోధక విభాగాల(సీఐఎఫ్‌)ను ఏర్పాటు చేశారు. బందీపురా, బద్గాం, శ్రీనగర్‌, బారాముల్లా, కుప్వారా, గాందర్బల్‌ జిల్లాల కోసం కిలో(కె)-ఫోర్స్‌ను నెలకొల్పారు. రాజౌరి, పూంచ్‌ జిల్లాల కోసం రోమియో(ఆర్‌)-ఫోర్స్‌, దోడా జిల్లా కోసం డెల్టా(డి)-ఫోర్స్‌, అనంతనాగ్‌, పుల్వామా, సోఫియాన్‌, కుల్గాం జిల్లాల కోసం విక్టర్‌(వి)-ఫోర్స్‌, ఉదంపూర్‌, బనిహాల్‌ కోసం యూనిఫాం(యు)-ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో 5,081 కిలోమీటర్ల పరిధిలో కె-ఫోర్స్‌ విధులు నిర్వహిస్తున్న ఉత్తర కశ్మీర్‌ అత్యంత కీలకమైంది.

దేశంలోనే ఇంతటి క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఎక్కడా లేవని కె-ఫోర్స్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌(జీవోసీ) ఎస్‌.ఎస్‌.సలారియా 'ఈటీవీ భారత్​'కు తెలిపారు. అత్యంత చలి ప్రదేశంలో, ఎత్తైన కొండల్లో, దట్టమైన అడవుల్లోనూ పోరాడగలిగేలా వీరికి శిక్షణ ఇస్తారు. ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కినట్లు అనుమానం వస్తే ఈ దళాలు వ్యూహాత్మకంగా విరుచుకుపడతాయి. ఇప్పటి వరకూ కె-ఫోర్స్‌ 2,733 మంది ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు 966 మందిని పట్టుకుంది. ఈ విభాగానికి చెందిన 585 మంది సిబ్బంది పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

జాగిలాలు సైతం..
ఉగ్రవాదుల వేట కోసం జాగిలాలనూ వినియోగిస్తున్నారు. భారతసైన్యం వద్ద మొత్తం 33 యూనిట్ల జాగిలాలు ఉండగా.. వాటిలో 12 యూనిట్లు ఒక్క కశ్మీర్‌లోనే ఉన్నాయి. ఒక్కో యూనిట్లో 24 శునకాలు ఉంటాయి. ఉగ్రవాదులను గుర్తించి, దాడి చేయగలిగేలా వీటికి శిక్షణ ఇస్తుంటారు. వీటి ఒంటికి కెమెరా, వాకీటాకీ అమర్చి పంపుతారు. కెమెరా ద్వారా కనిపించే దృశ్యాలను చూస్తూ.. వాకీటాకీ ద్వారా ఆదేశాలు జారీ చేస్తుంటారు.

indian army jammu kashmir border
బారాముల్లా డీఐజీ ఉదయ్​భాస్కర్​

ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే
కశ్మీర్‌లో తెలుగు అధికారి ఉదయ్‌భాస్కర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్‌ క్యాడర్‌కు చెందిన ఆయన గతంలోనూ అనేక ముఖ్య ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బారాముల్లా పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఉగ్రవాద సమస్య తీవ్రంగా ఉంది. అంతటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఉదయ్‌భాస్కర్‌ను 'ఈటీవీ భారత్​' పలకరించింది.

'ఇక్కడ జీవితమే ఒక సవాలు. ముప్పు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ పై అధికారిగా నేను పరిష్కరించాల్సిందే. ఉగ్రవాదులను పట్టుకునే ముందు మా సిబ్బందిలో ఏ ఒక్కరికీ ఎలాంటి హాని కలగకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యత. అందుకు తగ్గట్టుగానే ఆపరేషన్‌ జరుగుతున్నంతసేపు అక్కడే ఉండి మార్గనిర్దేశం చేస్తుంటాం. దేశవిదేశాల నుంచి చాలా మంది కశ్మీర్‌ను చూడటానికి వస్తుంటారు. కానీ, మేం మాత్రం కుటుంబంతో కలిసి ఇక్కడి పర్యాటక ప్రదేశాలు చూడటం భద్రతా కారణాల వల్ల చాలా కష్టం. పిల్లలతో షాపింగ్‌కూ వెళ్లలేం. దేశ సేవ ముందు ఇవన్నీ చిన్న విషయాలే.'

-ఉదయ్‌భాస్కర్‌, డీఐజీ, బారాముల్లా

కశ్మీర్​లో గత ఆరేళ్లలో పరిస్థితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.