పొరపాటున సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ యువకుడిని సైనికాధికారులు మానవతా దృక్పథంతో తిరిగి స్వదేశానికి పంపించారు. తీథ్వాల్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత అధికారులు పాకిస్థాన్ అధికారులకు ఆ యువకుడిని అప్పగించారు. అతనికి కొత్త బట్టలు, మిఠాయిలు అందించారు.
సదరు యువకుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లిపా ప్రాంతానికి చెందిన వాడని అధికారులు తెలిపారు. సోమవారం పొరపాటున నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోని కుప్వారాలోకి ప్రవేశించాడని ఆర్మీ అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: ఒడిశాలో ఎన్కౌంటర్- నక్సల్స్ క్యాంపులు ధ్వంసం