ప్రపంచంలో నిస్సారమైన భూములు పెరిగిపోవడం వల్ల ఆహార, ఆరోగ్య భద్రత, జీవన ప్రమాణాలు, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. భూములు, భూ వనరులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా భారతదేశం 2030నాటికి 6.42 కోట్ల ఎకరాల బంజరు భూములను సారవంతమైనవిగా, సాగు యోగ్యమైనవిగా మార్చేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
భూ పునరుద్ధరణ వ్యూహాల అమలులో తోటి అభివృద్ధి చెందుతున్న దేశాలకూ భారత్ సహాయపడుతోందని మోదీ తెలిపారు. ఎడారీకరణ, భూముల సార క్షీణత, కరవుల నివారణ అంశంపై సోమవారం ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. 'గత పదేళ్లలో భారత దేశం 74.13 లక్షల ఎకరాల విస్తీర్ణంలో అడవులను అభివృద్ధి చేసింది. దీంతో దేశ మొత్తం భూభాగంలో అటవీ ప్రాంతం 1/4వంతు వరకు చేరుకుంది. నిస్సారమైన భూముల్ని పునరుద్ధించుకోవాలన్న జాతీయ లక్ష్యాన్ని సాధించుకునే దిశగా పురోగమిస్తున్నాం' అని మోదీ తెలిపారు.
ఇదీ చూడండి: భారత్, చైనా, పాక్.. అణ్వాయుధాల జోరు!