ETV Bharat / bharat

నవంబర్​లోనే భారత్​లోకి కరోనా కొత్త స్ట్రెయిన్!

దేశంలో త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా పేర్కొన్నారు. రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్​కు ఆమోదం లభిస్తుందని అంచనా వేశారు. మరోవైపు, బ్రిటన్​లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్.. సెప్టెంబర్ నెలలోనే భారత్​లోకి ప్రవేశించి ఉంటుందన్నారు. టీకా సమర్థతపై కొత్త వైరస్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.

author img

By

Published : Dec 31, 2020, 7:09 AM IST

Updated : Dec 31, 2020, 10:52 AM IST

India will have COVID-19 vaccine within days: Dr Randeep Guleria
రేపో, మాపో అందుబాటులోకి కరోనా టీకా!

ఆక్స్​ఫర్డ్ టీకాకు బ్రిటన్ ఆమోదం తెలపడం గొప్ప ముందడుగు అని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా పేర్కొన్నారు. భారత్​లోనూ ఈ టీకా త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. రెగ్యులేటరీ సంస్థ వద్ద ఉన్న టీకా ట్రయల్స్ డేటాను బట్టి రోజుల వ్యవధిలోనే ఆమోదం లభించే అవకాశం ఉందని అంచనా వేశారు.

"కొవిడ్ వ్యాక్సిన్​ను భారత్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. చాలా త్వరలోనే టీకాకు అనుమతులు వస్తాయి. నెలలు, వారాలు కాదు.. రోజుల్లోనే టీకాకు ఆమోదం లభిస్తుంది."

-డా. రణదీప్ గులేరియా, దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్

వ్యాక్సినేషన్ విషయంలో పగడ్బందీ ప్రణాళికలు ఉన్నాయని గులేరియా తెలిపారు. సార్వత్రిక టీకా పంపిణీ కార్యక్రమం ద్వారా వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సరఫరా చేసిన అనుభవం దేశానికి ఉందన్నారు.

నవంబర్​లోనే..

మరోవైపు, బ్రిటన్​లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా నవంబర్​లోనే దేశంలోకి ప్రవేశించి ఉంటుందని తెలిపారు గులేరియా. యూకేలో సెప్టెంబర్ నెల​లో ఈ వైరస్ గుర్తించారని, ఆ తర్వాత దేశంలోకి వచ్చినవారికి కొత్త స్ట్రెయిన్ సోకి ఉండొచ్చని పేర్కొన్నారు. యూకేలో కొత్త స్ట్రెయిన్ బాధితుడు బయటపడక ముందే హోలండ్​లో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి నవంబర్​లో లేదా డిసెంబర్ తొలినాళ్లలోనే ఈ వైరస్ బాధితులు వచ్చి ఉండొచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను గుర్తించేందుకు నవంబర్ నుంచి సేకరించిన శాంపిళ్లను పరిక్షిస్తున్నట్లు చెప్పారు.

అయితే కొత్త కరోనా వల్ల తీవ్ర ప్రమాదమేమీ లేదని చెప్పారు గులేరియా. వైరస్ కేవలం పరివర్తనం చెందుతోందని, ఈ ప్రక్రియ గత పది నెలలుగా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉందని వెల్లడించారు. వేగంగా వ్యాప్తి చెందుతుండటమే ఆందోళనకరమైన విషయమని అన్నారు. టీకా సమర్థతపై కొత్త వైరస్ ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: దేశంలో 20 మందికి కొత్త రకం కరోనా నిర్ధరణ

Last Updated : Dec 31, 2020, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.