తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభన, జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర చొరబాట్లకు యత్నాలు సాగుతున్న వేళ.. చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(rajnath singh news) గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు యత్నించినా, భూ భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా తగిన జవాబు చెబుదామని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో(Pithoragarh latest news).. అమరులైన 232 మంది జవాన్ల సంస్మరణార్థం చేపట్టిన షహీద్ సమ్మాన్ యాత్రలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన రాజ్‌నాథ్.. తాము అధికారంలోకి రాగానే ఒకే ర్యాంకు-ఒకే పింఛను పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. భారత్ ఏ దేశాన్ని ఆక్రమించుకోదని, అయితే తమ జోలికి వస్తే బుద్ధిచెబుతామని స్పష్టం చేశారు(rajnath singh latest news).
"పొరుగుదేశాలతో మంచి సంబంధాలు ఉండాలని భారత్ కచ్చితంగా కోరుకుంటుంది. పెద్ద పెద్ద ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్‌ను బలహీనపరిచేందుకు, అస్ధిరపరిచేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని పాక్ వాటిని చేయలేకపోయింది. ఎక్కువ గొడవ చేస్తే కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు, సరిహద్దులు దాటి వెళ్లి కూడా సర్జికల్ స్ట్రైక్ చేయగలమని, అవసరమైతే వైమానిక దాడులు కూడా చేయగలమని ఆ దేశానికి సందేశం పంపించాం. భారత్ ఎప్పుడూ ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు. ఏ దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా భారత్ కబ్జా చేయలేదు. కాని ప్రపంచంలో ఏ దేశమైనా భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూమినైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే.. భారత్ గట్టి జవాబు ఇస్తుంది."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
124 మంది భారత జవాన్లు 1200 మంది చైనా సైనికులు..
రేజంగ్ లా కుమావోన్ బెటాలియన్ వీర శౌర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు రాజ్‌నాథ్(defence minister rajnath Singh news). ఈ బెటాలియన్‌లో 124మంది జవాన్లు అమరులు కాగా.. వారు 1200 మంది చైనా సైనికులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. నవంబర్ 18న బెటాలియన్‌ను సందర్శించినప్పుడు తనకు ఈ విషయం తెలిసిందని వివరించారు. భారత జవాన్ల శౌర్యానికి ఈ అద్భుతం ఓ నిదర్శనమని కొనియాడారు.
అయిదో ధామ్..
ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం నాలుగు ధామ్‌లు(చార్ ధామ్) ఉన్నాయని, సైన్య ధామ్(uttarakhand sainik dham) పేరుతో అయిదో ధామ్‌ను నిర్మించనున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. దీని కోసం అమరులైన ఉత్తరాఖండ్ సైనికుల ఇళ్ల నుంచి మట్టిని తెప్పించనున్నట్లు వివరించారు. వారి పేర్లను ధామ్‌పై లిఖించినున్నట్లు పేర్కొన్నారు. జవాన్ల త్యాగానికి గుర్తుగా ఈ స్మారకం ఎప్పటికీ ఉంటుందన్నారు(uttarakhand sainik uatra).
ధోనీలా ధామీ నిర్విరామ బ్యాటింగ్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని(pushkar singh dhami news) ప్రశంసలతో ముంచెత్తారు రాజ్‌నాథ్. మహేంద్ర సింగ్ ధోనీ టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసినట్టుగా.. ధామీ కూడా నిర్విరామంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన చేత మరో ఐదేళ్ల పాటు టెస్టు మ్యాచ్ ఆడించాలని ప్రజలకు సూచించారు. క్రికెట్ పరిభాషలో రాజ్‌నాథ్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. పుష్కర్ సింగ్ ధామీ ఈ ఏడాదే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తక్కువ సమయంలో ధామీ టీ20ల్లో ధోనీ బ్యాటింగ్‌లా పని చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిపించి మరో ఐదేళ్లు అధికారం ఇవ్వాలని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాడు భర్త వీరమరణం.. నేడు సైన్యంలో భార్య