ETV Bharat / bharat

వియత్నాం ప్రధానితో మోదీ కీలక భేటీ! - Nguyen Xuan Phuc

ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని నుగుయెన్​ జువాన్​ ఫుక్​తో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే దిశగా కీలక చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

India, Vietnam expected to ink pacts to expand ties at virtual summit on Monday
వియత్నాం ప్రధానితో మోదీ కీలక భేటీ!
author img

By

Published : Dec 21, 2020, 5:10 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని నుగుయెన్​ జువాన్ ఫుక్​తో వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం దిశగా కీలక చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ భాగంగా.. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి.

ఈ సదస్సులో ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి పరిస్థితిపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇరు దేశాలు స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన నియమాల ఆధారిత ప్రాంతీయ అభివృద్ధిపై ఆసక్తిని చూపుతున్నాయి.

'భారత్​-వియత్నాం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' భవిష్యత్తు అభివృద్ధి కోసం ఇరుపక్షాలూ దృష్టి సారించే అవకాశముంది. వియత్నాం హై స్పీడ్​ గార్డ్​ బోట్ల కోసం భారత రక్షణ లైన్ క్రెడిట్ అమలు గురించి సదస్సులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: తమిళనాడుకు వెళ్లనున్న ఎన్నికల సంఘం అధికారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.