ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయడం సహా.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్, అమెరికా అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య రాయబారి క్యాథరిన్ థాయ్తో, భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాల్ సంభాషణ.. ఫలప్రదంగా జరిగిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
"చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్, అమెరికా అంగీకరించాయి. పారదర్శకత, సులభతర వాణిజ్యం సూత్రాలకు అనుగుణంగా.. ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసే అంశంపై ఇరు దేశాల నేతలు చర్చించారు."
-వాణిజ్య మంత్రిత్వ శాఖ.
ట్రేడ్ పాలసీ ఫోరమ్(టీపీఎఫ్) బలోపేతంతో పాటు టీపీఎఫ్కు సంబంధించి తదుపరి మంత్రిత్వ స్థాయి సమావేశ ఏర్పాటుకు ఇరుదేశాలు అంగీకరించుకున్నాయని వాణిజ్య శాఖ తెలిపింది.
అంతకుముందు.. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యల పరిష్కారంపై ఇరు దేశాలు కలిసి కట్టుగా కృషి చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందం పేర్కొంది.
ఇదీ చూడండి:కరోనా సెకండ్ వేవ్- కారణాలు ఏంటంటే?