భారతీయ కూలీలను, ఉద్యోగులను తిరిగి గల్ఫ్ దేశాలకు అనుమతించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్.. అరబ్ దేశాలను కోరారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ)తో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో జయశంకర్ ఈ వినతి చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో భారతీయ కూలీలకు ఆశ్రయమిచ్చిన అరబ్ దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.
-
Assured them of continuing flow of food, medicines and essential items.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Apprised them of economic recovery and reforms in India. Agreed to further expand the India-GCC partnership.
">Assured them of continuing flow of food, medicines and essential items.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 3, 2020
Apprised them of economic recovery and reforms in India. Agreed to further expand the India-GCC partnership.Assured them of continuing flow of food, medicines and essential items.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 3, 2020
Apprised them of economic recovery and reforms in India. Agreed to further expand the India-GCC partnership.
'విదేశాల్లో ఉన్న వేల మంది కరోనా కారణంగా సొంతిళ్లకు చేరారు. లాక్డౌన్ అనంతరం వారు తిరిగి తమ పనులకు హాజరుకావాలని ఆశిస్తున్నారు. వారు క్షేమంగా తిరిగి విదేశాలకు చేరేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అవసరం అయితే భారత్ కూడా అందుకు సహకరిస్తుంది' అని జయశంకర్ అన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ సమావేశానికి ఎస్ జయశంకర్‌తో పాటు జీసీసీ జనరల్ సెక్రటరీ నయీఫ్ ఫాలా ఎమ్ అల్-హజ్రఫ్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, యూఏఈ విదేశాంగ మంత్రి అన్వర్ బిన్ మహమ్మద్ గర్గష్ హాజరయ్యారు. సౌదీ అరేబియా, కువైట్, కటార్కి చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.
సమావేశంలో చర్చించిన ఇతర కీలక అంశాలు..
- రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లో పరస్పరం సాయం చేసుకోవాలని భారత్-జీసీసీ దేశాలు నిర్ణయించుకున్నాయి.
- 2021 నుంచి భారత్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్లో నాన్-పర్మనెంట్ మెంబర్‌గా పరిగణించాలని జీసీసీ దేశాలు కోరాయి.
- కొవిడ్-19, టెర్రరిజం వంటి కీలక విషయాల్లో సహాయం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాయి.