ETV Bharat / bharat

ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి 242 మంది భారతీయులు

India ukraine news: ఉక్రెయిన్‌ నుంచి ఎయిర్​ఇండియా విమానం భారత్‌కు చేరుకుంది. 242 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎయిర్​ఇండియా విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

india ukraine news
ఉక్రెయిన్​ నుంచి ప్రత్యేక విమానంలో భారత్​కు 241 మంది..
author img

By

Published : Feb 23, 2022, 5:33 AM IST

India ukraine news: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావటంతో అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 242 మంది భారతీయులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి బయలుదేరిన ప్రత్యేకవిమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయులు, విద్యార్థులు ఉక్రెయిన్​ నుంచి దిల్లీకి చేరుకోనున్నట్లు తెలిపారు మురళీధరన్. ఉక్రెయిన్​లోని భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడంఎంతో ఉపశమనంగా ఉందని ఓ వైద్యవిద్యార్థి తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఉక్రెయిన్ నుంచి విమానాల రాకపోకలపై విధించిన ఆంక్షల్ని భారత్ ఎత్తివేసింది.

ఈనెల 22, 24, 26తేదీల్లో 3ప్రత్యేక వందేభారత్ విమానాలను ఉక్రెయిన్, భారత్ మధ్య నడపనున్నట్లు ఎయిర్​ ఇండియా ప్రకటించింది.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​లో టెన్షన్​ టెన్షన్​- స్వదేశానికి భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.