ETV Bharat / bharat

India Sri Lanka Ferry Service : భారత్​-శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభం.. 10 రోజులు మాత్రమే అందుబాటులో.. - భారత్ శ్రీలంక ఫెర్రీ టికెట్​ ధర

India Sri Lanka Ferry Service : భారత్​-శ్రీలంక మధ్య ఫెర్రీ సేవలను ప్రారంభమవడం ఇరు దేశాల సంబంధాల్లో కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలకంలోని కంకెసంతురై మధ్య ఫెర్రీ సేవలను కేంద్ర పోర్టుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు.

India Sri Lanka Ferry Service
India Sri Lanka Ferry Service
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 12:05 PM IST

Updated : Oct 14, 2023, 12:43 PM IST

India Sri Lanka Ferry Service : తమిళనాడులోని నాగపట్టినం, శ్రీలంకలోని కంకెసంతురై మధ్య ఫెర్రీ సేవలు ప్రారంభించడం ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంలో కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ఇరు దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భారత్‌, శ్రీలంకలు.. సంస్కృతి, వాణిజ్యం నాగరికతల లోతైన చరిత్రను పంచుకుంటున్నాయని ప్రధాని గుర్తుచేశారు.

  • #WATCH | Nagapattinam, Tamil Nadu: Union Minister of Ports, Shipping & Waterways and Ayush, Sarbananda Sonowal flags off the Ferry service between Tamil Nadu's Nagapattinam and Sri Lanka's Kankesanturai. External Affairs Minister Dr S Jaishankar joined the event virtually

    (Video… pic.twitter.com/BgtlQiir1P

    — ANI (@ANI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నాగపట్టినం నుంచి వందల ఏళ్లుగా వివిధ దేశాలతో వాణిజ్యం జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు. పురాతనమైన సాహిత్యంలోనూ భారత్‌, శ్రీలంకల మధ్య నౌకాయానం గురించి ప్రస్తావించినట్లు చెప్పిన మోదీ.. ఈ ఫెర్రీ సర్వీసు తిరిగి గత చరిత్రకు ప్రాణం పోస్తుందని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో కలిసి రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కోసం సంయుక్త విజన్ డాక్యుమెంట్‌ను ఆమోదించినట్లు వివరించారు. ఈ ఫెర్రీ సేవలతో కేవలం 30 నిమిషాల్లోనే కంకెసంతురై హార్బర్‌ను చేరుకోవచ్చని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.3 కోట్లు వెచ్చించింది.

ఇదో కీలక ముందడుగు : శ్రీలంక అధ్యక్షుడు
ఈ ఫెర్రీ సేవలు ప్రారంభమవడం భారత్-శ్రీలంక మధ్య కనెక్టివటీ పెంచడంలో కీలక ముందడుగు అని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. గత వేల సంవత్సరాలుగా ప్రజలు భారత ఉపఖండం నుంచి ఈ ద్వీపానికి (శ్రీలంక), ఇక్కడి నుంచి అక్కడికి పాక్​ జలసంధి గుండా ప్రయాణించారు. ఇలా మన సంస్కృతి, సంప్రదాయం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

కేవలం 10 రోజులు మాత్రమే!
India To Sri Lanka Ship : 'చెరియపాని' అనే ఈ షిప్​ను కేరళ.. కొచ్చి పోర్ట్‌లోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. 150 మంది ప్రయాణికుల సామర్థ్యంతో.. పూర్తి ఎయిర్​ కండిషనింగ్ వ్యవస్థతో రూపొందించింది. అయితే ఫెర్రీ సర్వీస్ 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా, బంగాళాఖాతంలో తుపాను సంకేతాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఈ సేవలను కొన్ని రోజులు నిలిపివేస్తారు. అనంతరం ఈ ఫెర్రీ సేవలను​ మళ్లీ ప్రారంభమవుతాయి.

టికెట్ ధర ఎంత?
India To Sri Lanka Ferry Ticket Booking : ఈ ఫెర్రీ సర్వీసులో ఒక్కో ప్రయాణికుడికి రూ.7,670 (6,500 + 18% జీఎస్​టీ) ఛార్జ్​ చేస్తారు. అయితే షిప్పింగ్​ కార్పొరేషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 14న మాత్రం టికెట్​పై 75 శాతం (రూ.2,375 + 18% జీఎస్​టీ) డిస్కౌంట్ ఇచ్చారు. ఈ షిప్​లో ప్రతి ప్రయాణికుడు 50 కిలోల వరకు లగేజ్​ను తీసుకెళ్లవచ్చని నిర్వాహకులు తెలిపారు.

శ్రీలంకపై మోదీ వరాల జల్లు.. 450 మిలియన్​ డాలర్ల సాయం

'చైనాతో సఖ్యతగా ఉన్నా... భారత్​-శ్రీలంక మైత్రి ప్రత్యేకం'

Last Updated : Oct 14, 2023, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.