దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆదివారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కొత్తగా 39,361మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 416మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 3,14,11,262
- మొత్తం మరణాలు: 4,20,967
- కోలుకున్నవారు: 3,05,79,106
- యాక్టివ్ కేసులు: 4,11,189
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కొత్తగా 18,99,874 మంది లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43,51,96,001కు చేరినట్లు స్పష్టం చేసింది.
ప్రపంచంలో..
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. వివిధ దేశాలు వైరస్ వ్యాప్తితో అల్లాడుతున్నాయి. డెల్టా వంటి వేరియంట్లు విరుచుకుపడుతున్న వేళ.. వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి.
వివిధ దేశాల్లో కొత్త కేసులు ఇలా
- ఇండోనేసియా: 38,679
- బ్రిటన్: 29,173
- ఇరాన్: 27,146
- రష్యా: 24,072
- బ్రెజిల్: 18,129
- మలేసియా: 18,129
ఇదీ చదవండి: