భారత్‌లో కొవిడ్ కేసులు (Corona virus India) వరుసగా నాలుగో రోజూ 40 వేలకుపైగా నమోదయ్యాయి. కొత్తగా 45,083 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 35,840 మంది కరోనాను జయించారు.
ప్రస్తుతం రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.
- మొత్తం కేసులు: 3,26,95,030
- మొత్తం మరణాలు: 437830
- మొత్తం కోలుకున్నవారు: 3,18,88, 642
- యాక్టివ్ కేసులు: 3,68,558
తగ్గిన టెస్టులు..
శనివారం ఒక్కరోజే 17 లక్షల 55 వేలకుపైగా పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 51 కోట్ల 86 లక్షలు దాటింది.
కరోనా వ్యాక్సినేషన్లో (COVID vaccination) భారత్ దూసుకెళ్తోంది. శనివారం 73 లక్షలకుపైగా టీకా డోసుల్ని లబ్ధిదారులకు అందించారు అధికారులు. మొత్తంగా ఇప్పటివరకు 63 కోట్ల 9 లక్షల 17 వేల 927 టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేరళలో లాక్డౌన్..
కేరళలో కరోనా విజృంభిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన 45,083 కేసుల్లో 31,265 కేరళ నుంచే కావడం గమనార్హం. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ కారణంగా తిరువనంతపురం సహా పలు ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.


- సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.
- లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్యలో క్రియాశీల కేసులున్నట్లు వెల్లడించింది.
- జులైలో రెండు పండగల కోసం ఆంక్షలను సడలించిన నాటి నుంచి కేరళలో మరోసారి వైరస్ విజృంభిస్తోంది.
ప్రపంచ దేశాల్లో కేసులు ఇలా..
కరోనా పలు దేశాలపై మళ్లీ విరుచుకుపడుతోంది.
- ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 5 లక్షల 43 వేల కేసులు, 8 వేలకుపైగా మరణాలు సంభవించాయి.
- అమెరికాలో శనివారం 72 వేల కేసులు నమోదయ్యాయి. మరో 600 మందికిపైగా చనిపోయారు.
- బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇరాన్‌లోనూ కేసులు తీవ్ర స్థాయిలో వెలుగుచూస్తున్నాయి.
ఇవీ చూడండి: 'పండగల వేళ జాగ్రత్త- కరోనాపై అలసత్వం వద్దు'
Afghanistan Crisis: 'అఫ్గాన్ తాజా పరిస్థితులకు అమెరికానే కారణం'