భారత్లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 26,041 మంది కొవిడ్ (Corona cases in India) బారినపడ్డారు. మరో 276 మంది మృతిచెందారు. ఒక్కరోజే 29,621 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,36,78,786
- మొత్తం మరణాలు: 4,47,194
- మొత్తం కోలుకున్నవారు: 3,29,31,972
- యాక్టివ్ కేసులు: 2,99,620
దేశవ్యాప్తంగా నమోదైన కొవిడ్ కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 15,951మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 165 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తారుగా కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 86,01,59,011 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 38,18,362 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.
ప్రపంచ దేశాల్లో..
ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) స్వల్పంగా తగ్గింది. తాజాగా 3,23,764 మందికి కొవిడ్ (Corona update) సోకింది. వైరస్ ధాటికి మరో 4,965 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,25,97,787కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,61,895కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా - 24,343
- రష్యా - 22,498
- బ్రిటన్ - 32,417
- టర్కీ - 25,861
- ఇరాన్ - 13,792
- బ్రెజిల్ - 8,668
ఇదీ చూడండి: నేడు భారత్ బంద్- అప్రమత్తమైన పోలీసులు