Corona Cases In India: దేశంలో సోమవారం 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1970 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 62వేల పైకి చేరింది. అయితే.. మరణాల సంఖ్య మాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. అసోం, కేరళ రాష్ట్రాలు గడిచిన ఇప్పటికే సమర్పించిన లెక్కలను సవరించడమే ఇందుకు కారణమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అసోం మృతుల సంఖ్యను 1,347 మేర, కేరళ 47 మేర పెంచగా.. సోమవారం ఒక్కరోజే 1399 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 5లక్షల 23వేలు దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 15,636
- మొత్తం మరణాలు: 5,23,622
- మొత్తం కేసులు: 4,30,62,569
- రికవరీలు: 42,523,311
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. సోమవారం 22,83,224 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,95,76,423 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 3, 81,485 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 86,980 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 171 మంది మృతిచెందారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 34,370 కరోనా కేసులు నమోదయ్యాయి. 110 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 34,908 కరోనా కేసులు బయటపడ్డాయి. 141 మంది వైరస్‌కు బలయ్యారు.
- ఇటలీలో 24,878 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 93 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 13,984 మంది వైరస్ సోకింది. మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ ప్రక్షాళనకు మేధోమథనం.. ఉదయ్పుర్లో చింతన్ శివిర్