దేశంలో కరోనా కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. తాజాగా 21,821 మందికి కొవిడ్ సోకినట్టు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య కోటీ 2లక్షల 66వేల 674కు పెరిగింది. వైరస్ కారణంగా మరో 299 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య లక్షా 48వేల 738కి చేరింది.
ఇదీ చదవండి: ఎర్నాకులంలో మొదటి షిగెల్లా కేసు
రికవరీ రేటు ఇలా..
దేశవ్యాప్తంగా మరో 26 వేల మందికిపైగా వైరస్‌ను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 98లక్షల 60వేల 280కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 57వేల 656కు తగ్గింది. రికవరీ రేటు 96.04 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బుధవారం ఒక్కరోజే 11లక్షల 27వేలకుపైగా నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 17కోట్ల 20లక్షలకు చేరినట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: నిషేధాలు, ఆంక్షల నడుమ.. న్యూఇయర్